యాప్నగరం

బాలుడినీ వదలని కీచక టీచర్.. బయటికి పొక్కకుండా మేనేజ్? తీవ్ర కలకలం

పాఠశాల విద్యార్థిపై టీచర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాలుడినీ వదలకుండా టీచర్ నీచానికి ఒడిగట్టడంపై తల్లిదండ్రులు నిలదీసినట్లు తెలుస్తోంది. అధికారులు విచారణ చేపట్టారు.

Samayam Telugu 15 Feb 2022, 4:13 pm
కామంతో కళ్లుమూసుకుపోతున్న దుర్మార్గులు స్కూల్ పిల్లలను కూడా వదలడం లేదు. మహిళలు, బాలికలపై అకృత్యాలతోనే అల్లాడిపోతుంటే బాలుడిని కూడా వదలని అత్యంత నీచమైన పరిస్థితులు దాపురించాయి. కార్పొరేట్ స్కూల్‌లో చదువుకుంటున్న బాలుడిపై టీచర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన నిజామాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. నగర శివార్లలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న బాలుడిపై అక్కడి వ్యాయామ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
molest


ఆ విషయం బాలుడు తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో విషయం బయటికి పొక్కింది. వెంటనే పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు రాకుండా తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం మేనేజ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈరోజు ఉదయం ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు పాఠశాలకు వచ్చి విచారణ జరపడం చర్చనీయాంశంగా మారింది. అయితే పాఠశాలలో అలాంటి సంఘటనలేవీ జరగలేదని పాఠశాల వర్గాలు చెబుతున్నాయి. బాలుడిపై లైంగిక దాడి జరిగిందన్న వ్యవహారం పట్టణంలో హాట్‌టాపిక్‌గా మారింది. విచారణాధికారులు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.