యాప్నగరం

మంచిర్యాల దొంగలా మజాకా.. కార్లు భద్రం.. చక్రాలు మాయం!

దొంగలంటే దొరికిందల్లా దోచుకెళ్తారు. కానీ ఈ దొంగలు తెలివిగా కార్లను వదిలేసి కారు చక్రాలను మాత్రం ఎత్తుకెళ్తున్నారు. ఈ చోరీలతో మంచిర్యాల వాసులు హడలెత్తిపోతున్నారు.

Samayam Telugu 8 Feb 2021, 10:52 pm
దొంగలు మరీ తెలివి మీరుతున్నారు. దొరికిన కాడికి దోచుకెళ్తున్నారు. కాదేదీ కవిత్వానికి అనర్హం అని శ్రీశ్రీ చెబితే.. కాదేదీ చోరత్వానికి అనర్హం అని చోర శిఖామణులు నిరూపిస్తున్నాయి. రోడ్డు మీద కార్లను ఎత్తుకెళ్తే దొరికిపోతాం అనుకున్నారేమో.. దొంగలు కారు చక్రాలను విప్పి ఎత్తుకెళ్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ తరహా దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి.
Samayam Telugu mancherial car tyres theft


గత నెలలో రెడ్డి కాలనీలో రోడ్డుపై నిలిపిన కారు చక్రాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. హైటెక్‌ సిటీ కాలనీలో నివాసముంటున్న బ్యాంక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ భరత్ కారు చక్రాలను ఎత్తుకెళ్లారు. కారు కింద రాళ్లను పెట్టి నాలుగు చక్రాలను ఊడదీసుకొని పారిపోయారు. తెల్లారి లేసి ఈ దృశ్యం చూసిన ఆయన షాకయ్యాడు. మారుతీ నగర్‌లో నివాసం ఉంటున్న ఎల్ఐసీ ఏజెంట్ కారు చక్రాలను కూడా ఇలా తస్కరించారు.

ఇళ్ల ముందు ఆరుబయట నిలిపించిన కార్లను టార్గెట్‌గా చేసుకొని రాత్రి పూట ఈ తరహాలో చోరీలు చేస్తున్నారు. తెల్లారేసరికి కార్లు ఉన్నా చక్రాలు మాయం అవుతుండటంతో.. వాటి యజమానులు లబోదిబోమంటున్నారు. ఈ దొంగతనాలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.