యాప్నగరం

కనుమ పండుగకు జింక మాంసం.. చివర్లో షాకింగ్ ట్విస్ట్

పండగపూట వన్యప్రాణులను పొట్టనబెట్టుకున్నారు. అడవిలో కృష్ణ జింకలను వేటాడి మాంసం అమ్మేందుకు వెళ్తుండగా వేటగాళ్లకు పోలీసులు షాకిచ్చారు.

Samayam Telugu 16 Jan 2021, 11:52 am
వన్యప్రాణులను వేటపై నిషేధం ఉన్నా వేటగాళ్లు బరితెగిస్తున్నారు. కనుమ పండగ పూట రెండు జింకలను అమానుషంగా వేటాడారు. జింకలను చంపి మాంసం అమ్మేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు ఊహించని షాకిచ్చారు. వేటగాళ్లను అటవీ శాఖాధికారులకు అప్పగించడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
black deer


బిచ్కుంద మండలం సిర్శముందర్, హస్గుల్ గ్రామ శివారులో రెండు కృష్ణ జింకలను వేటాడారు. జింకలను చంపి వాటిని అమ్మేందుకు నిజామాబాద్ తీసుకుని వెళుతుండగా వర్ని పోలీసులు పట్టుకున్నారు. వెంటనే అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. నిందితులను పిట్లం ఫారెస్ట్ రేంజ్ అధికారికి అప్పగించారు. నిందితులను బీర్కుర్ మండలం వీరాపూర్ దుబ్బకు చెందిన కడమంచి సాయిలు, కప్పరి పెద్దరాములుగా గుర్తించారు. నిందితులపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు.

nizamabad hunting



Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.