యాప్నగరం

గెస్ట్ హౌస్‌లో పాడు పని.. మీడియా రావడంతో తాను కాదంటూ తహసీల్దార్ తప్పించుకునే ప్రయత్నం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల నూతన తహసీల్దార్‌కు సుధాకర్ బుధవారం విధుల్లో చేరారు. నాగర్ కర్నూల్ జిల్లా నుంచి బదిలీపై వచ్చిన సుధాకర్ గురువారం రాత్రి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని గెస్ట్ హౌస్‌లో మందు గ్లాసుతో మీడియాకు చిక్కారు. సమాచారంతో అక్కడికి వెళ్లిన మీడియాకు స్పాట్‌లో ఓ అధికారి తారసపడ్డారు. గెస్ట్‌హౌస్‌లో ఇదేం పని అని అడిగిన మీడియాకు.. తాను కాదంటూ బుకాయించారు.

Edited byరావు | Samayam Telugu 12 Aug 2022, 8:16 am

ప్రధానాంశాలు:

  • కామారెడ్డి జిల్లాలో గెస్ట్ హౌస్‌లో మద్యం తాగిన ప్రభుత్వ ఉద్యోగి
  • మీడియా రావడంతో వీఆర్‌ఏపై నెట్టే ప్రయత్నం చేసిన ఎమ్మార్వో
  • ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని గెస్ట్ హౌస్‌లో ఘటన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Yallareddy mro
గెస్ట్ హౌస్‌లో ఉన్న మందు, పక్కనే తహసీల్దార్ సుధాకర్
ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో రాత్రి పూట మందు తాగుతున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన మీడియాకు స్పాట్‌లో ఓ అధికారి తారసపడ్డారు. గెస్ట్‌హౌస్‌లో ఇదేం పని అని అడిగిన మీడియాకు.. తాను కాదంటూ బుకాయించారు. మరి ఎవరు తాగుతున్నారంటే ఏమో తనకు తెలీదంటూ సమాధానం చెప్పుకొచ్చారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల నూతన తహసీల్దార్‌కు సుధాకర్ బుధవారం విధుల్లో చేరారు. నాగర్ కర్నూల్ జిల్లా నుంచి బదిలీపై వచ్చిన సుధాకర్ గురువారం రాత్రి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని గెస్ట్ హౌస్‌లో మందు గ్లాసుతో మీడియాకు చిక్కారు. ఆ సమయంలో మీడియా ప్రశ్నించగా.. తాను మద్యం తాగలేదంటూ బుకాయించారు. ఆ గ్లాస్ వీఆర్‌ఏ సాయిదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే, గెస్ట్ హౌస్‌ను ఇలాంటి పనులకు వినియోగించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.
రచయిత గురించి
రావు
గోనె.మహేష్ సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ వెబ్‌స్టోరీ విభాగానికి సంబంధించి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.