యాప్నగరం

జీతాలకు డబ్బుల్లేవు కానీ ప్రకటనలకు రూ.250 కోట్ల ఖర్చు: KCR సర్కార్‌పై ఈటల ఫైర్

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. మాయమాటలతో ప్రజలను బోల్తా కొట్టించడంలో కేసీఆర్‌ దిట్ట అని అన్నారు. పీకే రూ.600 కోట్ల కాంట్రాక్టుతో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ తరఫున పని చేస్తున్నాడని చెప్పుకొచ్చారు.

Authored byRaj Kumar | Samayam Telugu 16 Jun 2022, 9:48 am
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు. ప్రజల నాడి తెలిసిన సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిశోర్ (పీకే) అవసరం ఎందుకొచ్చిందో ప్రజలు ఆలోచించాలని అన్నారు. మాయమాటలతో ప్రజలను బోల్తా కొట్టించడంలో కేసీఆర్‌ దిట్ట అని విమర్శించారు. పీకే రూ.600 కోట్ల కాంట్రాక్టుతో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ తరఫున పని చేస్తున్నాడని చెప్పారు.
Samayam Telugu etela rajender


ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల ప్రజా సంక్షేమ పాలనపై బుధవారం మెదక్‌లో నిర్వహించిన సదస్సులో ఈటల మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ఓడిపోవడం ఖాయమని, బీజేపీదే అధికారమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరించబోతుందన్నారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం రూ.5 లక్షల కోట్ల అప్పుల పాలైందన్నారు. జీతాలిచ్చేందుకు డబ్బులు లేని సర్కారు.. రూ.250 కోట్లతో ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలెలా ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు.

ఒక్కో జిల్లాలో ఒక్కో తేదీన ఉద్యోగులకు జీతాలిచ్చే దుస్థితి నెలకొందని ఈటల చెప్పుకొచ్చారు. గ్రామాల్లో బెల్ట్‌ షాపులు పెట్టి మద్యంతో రూ.40 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం సంపాదించిందని, తాగుడుకు తెలంగాణ బానిసను చేశారని మండిపడ్డారు. మరోవైపు నష్ట పరిహారం ఇవ్వాలని కోరిన గౌరవెల్లి రైతులపై లాఠీ చార్జీ చేయించారని ఫైర్ అయ్యారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.