యాప్నగరం

మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి కన్నుమూత.. అప్పట్లో సీఎం కోసం పదవి త్యాగం

1980లో ముఖ్యమంత్రిగా ఉన్న టి.అంజయ్య కోసం ఎమ్మెల్యే పదవికి ముత్యంరెడ్డి రాజీనామా చేశారు.గత కొంత కాలంగా ముత్యం రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి కన్నుమూశారు.

Samayam Telugu 3 May 2021, 9:05 am
రామాయంపేట మాజీ శాసన సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ జెడ్పి చైర్మన్ రాజయ్యగారి ముత్యం రెడ్డి కన్నుమూశారు. తెలంగాణ కాంగ్రెస్ వెటరన్, రామాయంపేట మాజీ శాసన సభ్యుడు రాజయ్యగారి ముత్యం రెడ్డి మృతిచెందారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు జెడ్పీ చైర్మన్, శాసన మండలి సభ్యుడిగానూ పనిచేసిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Samayam Telugu మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి మృతి


ముత్యంరెడ్డి స్వస్థలం చిన్నశంకరం పేట మండలం కామారం గ్రామం. 1978 లో రామయంపేట ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. 1980లో ముఖ్యమంత్రిగా ఉన్న టి.అంజయ్య కోసం ఎమ్మెల్యే పదవికి ముత్యంరెడ్డి రాజీనామా చేశారు. తర్వాతి కాలంలో ముత్యం రెడ్డి ఎమ్మెల్సీగా, జెడ్పీ చైర్మ్ గా ప్రజలకు సేవలందించగలిగారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.