యాప్నగరం

Azadi ka amrit mahotsav: ఈ రైతన్న నిజమైన దేశ భక్తుడు..!

Azadi ka amrit mahotsav: దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశంపై తమకున్న గౌరవాన్ని చాటుకుంటున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు దేశంపై తమకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలానికి చెందిన ఓ రైతు వినూత్న రీతిలో మెసేజ్ ఇచ్చారు. దీంతో ఈ రైతన్న నిజమైన దేశ భక్తుడు అని అతన్ని పొగుడుతున్నారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 13 Aug 2022, 2:09 pm

ప్రధానాంశాలు:

  • నలుపురంగు వడ్లతో భారతదేశం చిత్రపటాన్ని వేసిన రైతు
  • రసాయనాలు వాడకుండా.. భూమిని కాపాడాలని పిలుపు
  • సేంద్రియ వ్యవసాయం చేయాలని రైతులకు విజ్ఞప్తి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Tirupati at the picture he made
తాను రూపొందించిన చిత్రం వద్ద రైతు తిరుపతి
Azadi ka amrit mahotsav: జిల్లా సిద్దిపేట చేర్యాల మండలం నాగపురి గ్రామానికి చెందిన రైతు జక్కుల తిరుపతి యాదవ్.. దేశంపై తనకున్న మక్కువను వినూత్న రీతిలో చాటుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా.. తన పొలంలో దేశవాళి విత్తనం కాలాబట్టి నలుపు రంగు వడ్లతో భారతదేశం () చిత్రపటాన్ని వేసి దేశభక్తిని చాటుకున్నారు. తాను సేంద్రియ రైతునని.. దేశీయ విత్తనాలను కాపాడే వ్యక్తినని చెప్పారు. ఏకలవ్య ఫౌండేషన్ బోర్డు మెంబర్ గా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. నాగపురి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఛైర్ పర్సన్ గా ఉన్న తన భార్య సహకారంతో.. నలుపు రంగు వడ్లతో భారతదేశం చిత్రపటాన్ని వేసినట్టు స్పష్టం చేశారు.
నిజమైన దేశభక్తికి అర్థం.. మన భూమిని కలుషితం కాకుండా కాపాడటమేనని అంటున్నారు తిరుపతి యాదవ్ (Tirupati Yadav). రసాయన ఎరువులు వాడకుండా.. సేంద్రియ వ్యవసాయం చేయాలని.. తద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. రైతులందరూ సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచిస్తున్నారు. ప్రజలు కూడా రైతులు పండించే సేంద్రియ ఉత్పత్తులను వాడి ప్రోత్సహించాలని తిరుపతి యాదవ్ కోరుతున్నారు. స్వాతంత్ర్యం అంటే.. "స్వా" అంటే మనది "తంత్రము" అంటే వ్యవస్థ అని చెబుతున్నారు రైతన్న తిరుపతి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ధనాన్ని వ్యవసాయం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నాయని.. సేంద్రియ వ్యవసాయం (Organic farming) కూడా పెరిగేలా చూడాలని కోరుతున్నారు తిరుపతి యాదవ్. సేంద్రియ వ్యవసాయంతో.. భూసారం పెరుగుతుందని.. ప్రజలకు రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. అప్పుడు ఆరోగ్యం మీద చేసే ఖర్చు తగ్గుతుందని.. ఆ ధనాన్ని దేశ అభివృద్ధికి వినియోగించవచ్చని సూచిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో ఉండి నిరంతరం కాపాడుతున్న జవాన్లకు తాను రూపొందించిన చిత్రం అంకితమని స్పష్టం చేశారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.