యాప్నగరం

ప్రియుడితో అర్ధరాత్రి అత్త రాసలీలలు.. కిటికీలో నుంచి చూసిన కోడలు, ఊహించని ట్విస్ట్

వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న కోడలిని ఓ అత్త ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా చంపేసింది.

Samayam Telugu 18 Oct 2021, 10:06 pm

ప్రధానాంశాలు:

  • వికారాబాద్ జిల్లాలో దారుణం
  • పరాయి వ్యక్తిలో అక్రమ సంబంధం పెట్టుకున్న అత్త
  • నిలదీసిన పాపానికి కోడలి దారుణహత్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
వివాహేతర సంబంధాలు పచ్చటి కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో పడి కుటుంబసభ్యులనే కడతేరుస్తున్నారు కొందరు కిరాతకులు. తాజాగా వికారాబాద్‌లో జరిగిన ఘటన షాక్‌కు గురిచేస్తోంది. అర్ధరాత్రి ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తుండగా చూసిందని కోడలిని అతికిరాతకంగా చంపేసిందో అత్త.
పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన మంగమ్మ(51) భర్త నర్సింహులు కొంతకాలం క్రితం అనారోగ్యంతో మరణించాడు. ప్రస్తుతం ఆమె కొడుకు, కోడలితో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలోనే మంగమ్మ అదే గ్రామానికి చెందిన నఫీస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో అతడిని ఇంటికి పిలిపించుకొని రాసలీలలు కొనసాగించేది. ఓ రోజు అర్ధరాత్రి మంగమ్మ గది నుంచి చప్పుళ్లు వినిపించడంతో కోడలు కిటికీలో నుంచి చూసి షాకైంది.

ఆ మరుసటి రోజు కోడలు అత్తకు వార్నింగ్ ఇచ్చింది. ‘ఇలాంటి పాడుపనులు మానుకోకపోతే నీ కొడుక్కి చెప్పి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తా’ అని హెచ్చరించింది. దీంతో తన బాగోతం కోడలికి ఎక్కడ తెలిసిపోతుందోనన్న భయంతో మంగమ్మ కోడలిని హత్య చేయడానికి ప్లాన్ వేసింది. ఆదివారం కోడలు నిద్రపోతుండగా ప్రియుడు నఫీస్‌తో కలిసి మంగమ్మ ఆమె గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఇద్దరూ కలిసి పరారయ్యారు. సోమవారం ఉదయం ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా మంగమ్మ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. ఆమె పరారీలో ఉండటంతో ఈ హత్య మంగమ్మే చేసి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించి ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.