యాప్నగరం

వేగంగా దూసుకెళ్లి బోల్తాకొట్టిన ఆర్టీసీ బస్సు.. అందులో 60 మంది.! బాబోయ్ ఘోరం

వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సులో 60 మంది ప్రయాణికులుండడంతో కలకలం రేగింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 30 మందికి పైగా గాయాలయ్యాయి.

Samayam Telugu 12 Nov 2021, 5:19 pm
వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం 60 మంది ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న బస్సు వేగంగా దూసుకెళ్లి రోడ్డు పక్కన గుంతలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి నుంచి తాండూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మర్పల్లి మండలం కల్కొడ చౌరస్తా వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. అతివేగంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు ఎత్తుపల్లాలను డ్రైవర్ పట్టించుకోకుండా వేగంగా పోనివ్వడంతో అదుపుతప్పి పక్కకు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో సగానికిపైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను మర్పల్లి మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న బాధితులను అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పెద్దాస్పత్రులకు తరలిస్తున్నారు. బస్సులో ఇందోల్‌, తాండూర్‌, సదాశివపేట్‌, మొరంగపల్లి, మలసోమారం, పెద్దాపూర్‌, కొడంగల్‌, జహీరాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
Samayam Telugu బోల్తా కొట్టిన బస్సు
bus


bus


accident



Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.