యాప్నగరం

భర్తను రాత్రి పత్తి చేనులోకి తీసుకెళ్లి..

వివాహేతర సబంధానికి భర్త అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలసి దారుణంగా చంపేసిందో భార్య.. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Samayam Telugu 6 Nov 2021, 2:12 pm

ప్రధానాంశాలు:

  • రంగారెడ్డి జిల్లాలో దారుణం
  • ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన భార్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలసి దారుణంగా చంపేసింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. పూడూరు మండల పరిధిలోని చంగోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దీనిపై కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎరుకల వెంకటయ్య (30), మాధవి(26) దంపతులు.. అయితే అదే గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తితో మాధవి వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో వీరు కలిసేవారు. కొన్ని రోజుల కింద భర్త వెంకటయ్యకు ఈ విషయం తెలిసింది.

దీంతో వెంకటయ్య భార్య మాధవిని పలుమార్లు మందలించాడు. శేఖర్‌ను కలవడం మానుకోమని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలోనే భర్తపై మాధవి కక్ష పెంచుకుంది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగానే అడ్డు తొలగించుకోవాలని శేఖర్‌‌తో కలసి పథకం వేసింది. ఈక్రమంలోనే గురువారం రాత్రి గ్రామానికి సమీపంలో ఉన్న పత్తి చేనులోకి వెంకటయ్యను తీసుకెళ్లి మాధవి, శేఖర్ కలసి చంపేశారు. దీనిపై వెంకటయ్య కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.