యాప్నగరం

వరంగల్ ఎంజీఎంలో మరణ మృదంగం.. ఒక్కరోజులో 27 మంది మృతి?

వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో మరణ మృదంగం కొనసాగుతోంది. కరోనా రోగులతో వార్డులన్నీ నిండిపోయాయి. గడిచిన 21 గంటల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 28 Apr 2021, 11:22 am

ప్రధానాంశాలు:

  • వరంగల్ ఎంజీఎంలో కరోనా విలయం
  • ఒక్కరోజులో 27 మరణం
  • రోగులతో నిండిపోతున్న వార్డులు, బెడ్లన్నీ ఫుల్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Image
వరంగల్ జిల్లాలో కరోనా మహమ్మారి చెలరేగిపోతోంది. హైదరాబాద్‌ తర్వాత అత్యధిక కరోనా కేసులు, మరణాలు వరంగల్ జిల్లాలో నమోదవుతుండం ఆందోళన కలిగిస్తోంది. గాంధీ ఆస్పత్రికి పోటీగా ఎంజీఎం హాస్పిటల్‌లో మరణ మృదంగం కొనసాగుతోంది. ఎంజీఎంలో గడిచిన 21 గంటల వ్యవధిలోనే కరోనాతో 27 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో నగర ప్రజలు వణికిపోతున్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సిబ్బందిలో వణుకు మొదలైంది. ఎన్నికల నేపథ్యంలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రోజూ వేల సంఖ్యలో అనుమానితులు కోవిడ్ పరీక్షలు చేయించుకుంటుండగా వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్య పరిస్థితి విషమించి వారందరినీ ఎంజీఎంకు తరలిస్తుండటంతో బెడ్లన్నీ నిండిపోతున్నాయి. చాలామంది విషమ పరిస్థితుల్లో వస్తుండటంతో వారిని కాపాడటం డాక్టర్లు సాధ్యం కావడం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.