యాప్నగరం

ఇమామ్లకు ఇచ్చే గౌరవం అర్చకులకు ఇవ్వరా..?: బండి సంజయ్

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు. భగవద్గీతను కించపరిస్తే సహించబోమని స్పష్టం చేశారు. తెలంగాణ సర్కార్ అర్చకులకు ఎందుకు గౌరవం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గౌడన్నలను గోస పెడుతూ.. కేసీఆర్ పబ్బం గడుపుతున్నారని ఫైర్ అయ్యారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 18 Aug 2022, 2:54 pm

ప్రధానాంశాలు:

  • జనగామ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర
  • అధికారంలోకొస్తే పేద బ్రాహ్మణులను ఆదుకుంటామని హామీ
  • గౌడ సోదరుల సంక్షేమం కోసం కృషి చేస్తామని వెల్లడి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bandi Sanjay with priests
అర్చకులతో బండి సంజయ్
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా బండి సంజయ్.. వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ.. వారి బాధలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. అర్చకులతో సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బండి కీలక కామెంట్స్ చేశారు. భగవద్గీతను కించపరిస్తే అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు. ఇమామ్ లకు ఇచ్చే గౌరవం అర్చకులకు ఇవ్వరా..? అని సంజయ్ ప్రశ్నించారు. అర్చకులు (Priests) అడ్డాకూలీ వద్ద అడుక్కునే దుస్థితికి వచ్చినా స్పందించరా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (BJP) అధికారంలోకొస్తే.. పేద బ్రాహ్మణులను ఆదుకుంటామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. గౌడ సోదరుల సంక్షేమం కోసం బీజేపీ కృషి చేస్తుందని బండి సంజయ్ వివరించారు. గౌడన్నలను గోస పెడుతూ.. కేసీఆర్ (KCR) పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. వారి పొట్ట గొట్టే చర్యలకు పాల్పడుతున్నారని.. ఇకపై ఈ అరాచకం సాగబోదని వ్యాఖ్యానించారు. అనంతరం పాదయాత్రలో భాగంగా.. గొల్లకురమలతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నెల్లుట్లలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు.

జనగామ టౌన్ బహిరంగ సభలో పాల్గొన్న బండి సంజయ్.. సభా ప్రాంగణంలో అమరవీరులు సామా జగన్ మోహన్ రెడ్డి, చంచారపు రవీందర్ రెడ్డి, నెల్లుట్ల నరసింహారావు, వెంకట్ ఫోటోలకు నివాళులర్పించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.