యాప్నగరం

Munugode Bypoll: మునుగోడులో గెలిచేది మేమే.. ఆపడం ఎవరితరం కాదు: బండి సంజయ్

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీయే గెలుస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరన్నారు.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 17 Aug 2022, 5:48 pm

ప్రధానాంశాలు:

  • మునుగోడులో బీజేపీదే విజయం
  • కేసీఆర్‌ని గద్దె దించుతాం
  • బండి సంజయ్ వ్యాఖ్యలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu bandi sanjay kumar
ఎవరెన్ని హామీలు గుప్పించినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా మునుగోడు ఉపఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండాయేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జనగామ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ లాంటిదని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోలేదన్నారు. కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతూ.. బీజేపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తనను మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకంతోనే రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని పేర్కొన్నారు.
ఇన్నాళ్లూ మునుగోడు నియోజకవర్గాన్ని పట్టించుకోని సీఎం కేసీఆర్.. ఉపఎన్నిక వల్లే నిధులు విడుదల చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు స్వస్తి పలికే సమయం ఆసన్నమైందన్న బండి సంజయ్.. డబుల్ ఇంజిన్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని గెలిపించుకుని బీజేపీ బలాన్ని పెంచుకుంటామని.. ఇదే తరహాలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.