యాప్నగరం

ఇంట్లోనే ఉరేసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు... సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు

కుటుంబ ఆస్తి తగాదాలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడొకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో సోమవారం చోటుచేసుకుంది.

Samayam Telugu 19 Jan 2021, 10:22 am
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వరమ్మతోట కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు లింగమూర్తి(48) ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం గాడిపెళ్లి గ్రామానికి చెందిన లింగమూర్తి(48) ఖానాపూర్ మండలం బుధరావుపేటలో సోషల్ టీచర్‌గా పని చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఆయన భార్య ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లడంతో ఇంట్లో ఆయన ఒక్కరే ఉంటున్నారు. సోమవారం విధులకు వెళ్లిన లింగమూర్తి తిరిగొచ్చాక గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న నర్సంపేట ఎస్ఐ నవీన్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Samayam Telugu Image


Also Read: హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న మహిళకు అస్వస్థత.. గాంధీ ఆస్పత్రిలో చేరిక

కుటుంబ ఆస్తి విషయంలో తల్లిదండ్రులు, సోదరితో లింగమూర్తికి కొంతకాలంగా తగాదాలు జరుగుతున్నాయి. నాలుగు నెలల క్రితం ఆయన సోదరుడు నవీన్ ఆకస్మిక మరణంతో గొడవలు మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలోనే లింగమూర్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గదిలో దొరికిన సూసైడ్ నోట్‌లో ‘నా చావుకు కారణం తల్లిదండ్రులు, సోదరే’ అంటూ ఆయన రాసిపెట్టారు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.