యాప్నగరం

నిర్లక్ష్యం వద్దంటూ టీచర్ సెల్ఫీ సందేశం.. అంతలోనే

కరోనతో ఆస్పత్రలో చికిత్స పొందుతున్న టీచర్ రవి... తన వారి కోసం ఓ సెల్ఫీ సందేశం అందించారు. కరోనా విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయోద్దంటూ సూచించాడు. అనవసరంగా బయటకు తిరగొద్దు అంటూ ఆయన హెచ్చరించాడు.

Samayam Telugu 2 May 2021, 10:30 am
కరోనా కాటుకు అనేకమంది బలవుతున్నారు.సామాన్యులతో పాటు, డాక్టర్లు, టీచర్లు, పోలీసులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కరోనాతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌కు చెందిన కంగాల రవి (35) మంగపేటలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయనకు కరోనా సోకడంతో వారం రోజులుగా నర్సంపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Samayam Telugu కరోనాతో ఉపాధ్యాయుడు మృతి


అయితే శుక్రవారం రాత్రి ఆస్పత్రి బెడ్‌పైనుంచి ఆయన సెల్ఫీ వీడియో తీశారు. స్నేహితులకు వాట్సాప్‌ ద్వారా ఓ మెసేజ్ పంపించారు. కొద్దిపాటి నిర్లక్ష్యం చేసినా కరోనా వైరస్ కకమ్ముకుంటుందని, ఎవరూ కూడా బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని అందులో సూచించారు. తాను పడుతున్న ఇబ్బందులు మరెవరికీ రావొద్దని కోరారు. ఇంతలోనే శనివారం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆయనను ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో రవి మృతి చెందారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.