యాప్నగరం

డ్రైవర్‌ లేకుండానే పొలం దున్నే ట్రాక్టర్.. విద్యార్థుల ఆవిష్కరణకు కేటీఆర్ ఫిదా

డ్రైవర్ లెస్ కార్లు వస్తున్నాయన్న ముచ్చట మనకు వినిపిస్తూనే ఉంది. అయితే.. అది ఇక్కడ కాదు విదేశాల్లో. మరి అలాంటిది మన దేశంలో సాధ్యమే కాదు.. అనే వారికి సమాధానంగా వరంగల్ కిట్స్ బృందం అద్భుత ఆవిష్కరణ చేసింది. డ్రైవర్ లేకుండా నడవటమే కాదు.. ఏకంగా పొలం కూడా దున్నే ట్రాక్టర్‌ను వరంగల్ కిట్స్ బృందం ఆవిష్కరించింది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 17 May 2023, 3:19 pm

ప్రధానాంశాలు:

  • డ్రైవర్ లెస్ ట్రాక్టర్‌ను ఆవిష్కరించిన కిట్స్ బృందం
  • కిట్స్ బృందం ఆవిష్కరణకు ఫిదా అయిన కేటీఆర్
  • ట్విట్టర్లో ట్రాక్టర్ వీడియో షేర్ చేసిన మంత్రి కేటీఆర్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu tractor1
డ్రైవర్ లెస్ ట్రాక్టర్
ప్రస్తుతం ప్రపంచంలో టెక్నాలజీ ట్రెండ్ నడుస్తోంది. పొద్దున లేచినప్పటి నుంచి.. రాత్రి పడుకునే వరకు ప్రతీ ఒక్కటి టెక్నాలజీతో అనుసంధానమై ఉంటోంది. అయితే.. ప్రపంచాన్ని శాసిస్తోన్న ఈ టెక్నాలజీ ఇప్పుడు వ్యవసాయంలోకి కూడా అడుగుపెట్టి సాగును కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఈ క్రమంలోనే.. వ్యవసాయం కోసం యువత కొత్త కొత్త ఆవిష్కరణలతో సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. వరంగల్ కిట్స్ బృందం అదిరిపోయే ఆవిష్కరణతో ముందుకొచ్చింది. డ్రైవర్ లేకుండానే.. పొలం దున్నే ట్రాక్టర్‌ను కిట్స్ బృందం ఆవిష్కరించింది. డ్రైవర్లెస్ అటానమస్ ట్రాక్టర్ను చూసి.. మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. డ్రైవర్లెస్ ట్రాక్టర్‌ను డెవలప్ చేసిన వరంగల్ కిట్స్ బృందాన్ని కేటీఆర్ అభినందించారు. ఈ మేరకు ట్విటర్లో ట్రాక్టర్ వీడియోను పంచుకున్నారు. ఇంకా ఇలాంటి ఆకర్షణీయమైన ఆవిష్కరణలతో యువత ముందుకు రావాలని కేటీఆర్ కోరారు.
వ్యవసాయంతో పాటు సామాజిక ప్రభావం చూపాలనుకునే యువ ఆవిష్కర్తలు.. ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు, ఉత్పత్తులతో ముందుకు రావాలని కేటీఆర్ సూచించారు. సామాజిక మేలు కోసం మంచి ఆవిష్కరణలు ఆవిష్కరించాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. టీహబ్‌, టీవర్క్స్, వీహబ్‌, రిచ్‌ హైదరాబాద్‌, టీం టీఎస్‌ఐసీ వంటి సంస్థలను ఇలాంటి యువ ఆవిష్కర్తలకు చేయూతనిచ్చేందుకే ఏర్పాటు చేశామని మంత్రి గుర్తు చేశారు.



వరంగల్ కిట్స్ బృందం అభివృద్ధి చేసిన డ్రైవర్ లెస్ ట్రాక్టర్.. అన్నదాతలను ఆకట్టుకొంటుంది. అసలే రైతు కూలీల కొరత ఉన్న సమయంలో.. ఇలా డ్రైవర్ కూడా అవసరం లేకుండనే పొలం పనులు చేస్తున్న ట్రాక్టర్ను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ట్రాక్టర్లతో ఎవరి మీద ఆధారపడకుండా తమ పొలం పనులను తామే సొంతం చేసుకునే అవకాశం ఉందని.. డ్రైవర్ ఖర్చులు కూడా మిగులుతాయంటూ రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణల వల్ల.. సాగు మరింత సులభతరం అవుతుందని అన్నదాతలు చెప్తున్నారు.


ఇదెక్కడి పైత్యం సామీ.. సొంత పార్టీ నేతలపైనే ట్రోలింగులా.. ఇది కాంగ్రెసోళ్లకే సాధ్యం..!
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.