యాప్నగరం

అత్తారింటికొచ్చి ప్రొఫెషనలిజం చాటిన దొంగ.. మామల ‘సన్మానం’

అతడో దొంగ.. ఇప్పటికే రేప్, మర్డర్, దొంగతనాల కేసుల్లో 21సార్లు అరెస్టయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలోనే జైలుకెళ్లొచ్చాడు. తర్వాత అత్తారింటికి వెళ్లాడు. కానీ తన తీరు మార్చుకోలేదు.

Samayam Telugu 21 Dec 2020, 8:21 am
ఓ దొంగ అత్తారింటికి వెళ్లినప్పుడు సైతం తన ప్రొఫెషనలిజాన్ని వీడలేదు. చేతి ఖర్చులకు డబ్బుల కోసం చిల్లర దొంగతనాలు చేశాడు. సీసీటీవీ ఫుటేజీలో దృశ్యాలు రికార్డవడంతో అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం అరెస్టయ్యి రిమాండులో ఉన్నాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్లలోని సుందరయ్యనగర్‌కు చెందిన గిడ్డూ సింగ్ అలియాస్ గోవింద్ సింగ్ (35 ఏళ్లు) ఓ దొంగ.
Samayam Telugu Thief
నమూనా చిత్రం


హత్యలు, అత్యాచారం, గుడుంబా అక్రమ రవాణా, ఇళ్లలో దొంగతనాలు.. ఇలా అనేక నేరాలకు పాల్పడిన గిడ్డూ సింగ్ ఇప్పటి వరకూ 21సార్లు అరెస్టయ్యాడు. ఈ మధ్యే జైలు నుంచి విడుదలైన గిడ్డూ సింగ్.. తర్వాత హైదరాబాద్‌లోని అత్తారింటికి వెళ్లాడు. చేతి ఖర్చుల కోసమని సరదాగా ఓ పాన్‌షాపులో, చికెన్ షాపులో దొంగతనాలు చేశాడు.

సీసీటీవీ ఫుటేజీ ద్వారా అతణ్ని గుర్తించిన ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అత్తారింటికి వెళ్లినా సరే తన తీరును మార్చుకోని సదరు దొంగకు ఇప్పుడు పోలీసు మామలు ‘సన్మానం’ చేస్తున్నారేమో.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.