యాప్నగరం

కరోనా సోకిందని కుటుంబంలో ఘర్షణ... ఆత్మహత్యాయత్నం.. చివరకు

కుమార స్వామి గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడికి కరోనా సోకిందేమోనన్న అనుమానం ఇంట్లో వారిలో వచ్చింది. ఇదే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది.

Samayam Telugu 26 Apr 2021, 1:42 pm
కరోనా సోకిందన్న అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలోని దీక్షకుంట్లలో చోటు చేసుకుంది. దీక్షకుంట్ల గ్రామానికి చెందిన బండారు కుమారస్వామి (45) గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు. దానికి తోడు సరిగా తినకపోవడంతో నీరసించిపోయాడు. దీంతో అతడికి కరోనా సోకిందేమో అని కుటుంబ సభ్యుల్లో మొదలైన అనుమానం ఘర్షణకు దారి తీసింది.
Samayam Telugu కరోనా విషయంలో గొడవ మృతి


ఈ నేపథ్యంలో నాలుగు రోజుల కిందట కుమారస్వామి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతన్ని నెక్కొండలోని ఆస్పత్రికి తరలించారు. అయితే రెండ్రోజుల చికిత్స అనంతరం అక్కడ నుండి వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి శనివారం తరలించారు. శనివారం సాయంత్రం టెస్ట్ చేయగా మొదట నెగటివ్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం పొద్దున మరోసారి చేయగా పాజిటివ్ గా వచ్చినట్లు సమాచారం.

ఈలోపే అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో మృతి చెందాడు. అతని మృతదేహన్ని స్వగ్రామమైన దీక్షకుంట్లకి సోమవారం ఉదయం తరలించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకొని దహనసంస్కారాలు పూర్తి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.