యాప్నగరం

కొత్త కారు నడపాలనే కోరిక.. కానీ డ్రైవింగ్ రాదు! బీభత్సం

Annaram Sharif Dargah: కొత్త కారును నడపాలనే మోజు. కానీ, డ్రైవింగ్ సరిగా రాదు. అయినా, సాహసం చేశాడు. ఆ ప్రయత్నం వికటించింది. నలుగురి ప్రాణాల మీదికి వచ్చింది. అక్కడున్న వారందరికీ కోపం తెప్పించింది. కారు నడిపిన వ్యక్తిని చితకబాదారు. ప్రమాదంలో గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలు వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 20 Jan 2023, 11:12 pm
కొత్త కారు తనే నడపాలనే కోరిక. కానీ, డ్రైవింగ్ రాదు. అయినా, సాహసం చేశాడు. సీన్ రివర్స్ అయ్యింది. జనం మీదికి దూసుకెళ్లింది. నలుగురు ఆస్పత్రి పాలయ్యారు. వారిలో ఇద్దరు సీరియస్‌గా ఉన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవింగ్ సరిగా రాకున్నా కారు నడిపి, పలువురి ప్రాణాల మీదకు తెచ్చిన ఆ వ్యక్తిని స్థానికులు పట్టుకొని చితకబాదారు.
Samayam Telugu Warangal Car Accident
ప్రమాదానికి కారణమైన కారు


హ్యూందాయ్ కంపెనీకి చెందిన కొత్త కారును కొనుగోలు చేసిన ఓ వ్యక్తి.. ఆ వాహనానికి పూజ చేయించేందుకు పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌ ‌దర్గా వద్దకు తీసుకొచ్చాడు. అక్కడ భక్తులు, వాహనాలతో రద్దీ ఎక్కువగా ఉండటంతో గందరగోళానికి గురయ్యాడు. అటూ ఇటూ పోనిస్తూ బీభత్సం సృష్టించాడు. చివరికి వాహనాలపైకి, జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ కొత్త కారుతో పాటు మరో రెండు కార్లు, ఓ ఆటో స్వల్పంగా దెబ్బతిన్నాయి.

కొంపముంచిన కొత్త కారువరంగల్‌‌లో నడిరోడ్డుపై బీభత్సం
ప్రమాదంలో గాయపడిన నలుగురిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానికులు ఆగ్రహంతో కారు నడిపిన వ్యక్తిపై దాడి చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.