యాప్నగరం

TRS ఎమ్మెల్సీ మంచి మనసు.. పైలట్ కోర్సులో చేరబోతున్న సెక్యూరిటీ గార్డ్ కూతురు!

వరంగల్‌కు చెందిన ఓ సెక్యూరిటీ గార్డ్ కూతురికి పైలట్ కోర్సులో సీటు వచ్చింది. కానీ ఆర్థిక సమస్యల కారణంగా ఆమె కోర్సు మానేసే పరిస్థితి రాగా.. సాయం చేయడానికి పోచంపల్లి ముందుకొచ్చారు.

Samayam Telugu 9 Jan 2021, 1:50 pm
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మంచి మనసు చాటుకున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా పైలట్ కోర్సులో చేరడానికి ఇబ్బంది పడుతున్న ఓ సెక్యూరిటీ గార్డ్ కూతురికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌లోని గిర్మాజీపేటలో నివసించే పోలెపాక గోపీ, భాగ్య దంపతుల కుమార్తె మానస బీఎస్సీ పూర్తి చేసింది. కమర్షియల్ పైలట్ కావాలనేది ఆమె కల.
Samayam Telugu Pochampally Srinivas Reddy
Image: Twitter


ఇందుకోసం ప్రవేశ పరీక్ష రాసిన మానస.. హైదరాబాద్‌లోని స్టేట్ ఏవియేషన్ అకాడమీలో పైలట్ కోర్సులో సీటు పొందింది. అడ్మిషన్ ఫీజ్ కింద రూ.10 వేలు చెల్లించింది. కానీ ఆర్థిక సమస్యల కారణంగా కోర్సు నుంచి వైదొలిగే పరిస్థితి తలెత్తింది.

మానస ఆర్థిక పరిస్థితి, ఆమె కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి.. పైలట్ కోర్సు పూర్తి చేయడానికి ఆర్థిక తోడ్పాటును అందించడానికి ముందుకొచ్చారు. ఆమె చదువుకయ్యే ఖర్చును భరిస్తానని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.