యాప్నగరం

లాభసాటిగా ఆయిల్ ఫామ్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి: మంత్రి ఎర్రబెల్లి

సీఎం కేసీఆర్‌కు ఏ కాలంలో ఏ పంటలు వేయాలనే విషయంపై పూర్తి అవగాహన ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయిల్ ఫామ్ లాభసాటిగా ఉందని.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందని ఆయన చెప్పారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 17 May 2022, 4:31 pm
ఏ కాలంలో ఏ పంటలు వేయాలనేది చాలా ముఖ్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. గతంలో కొదరు వరి పంట విషయంలో రైతులను మోసం చేశారని మండిపడ్డారు. వరంగల్ కోడెం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల వానాకాలం పంటల అవగాహన సదస్సులో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.
Samayam Telugu మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు


ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏ కాలంలో ఏ పంటలు వేయాలనే విషయంపై పూర్తి అవగాహన ఉందని.. అందుకే అన్నదాతలకు లాభదాయక పంటలను వేసేలా చర్యలు తీసుకుంటున్నారని మంత్రి అన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి 3 వేల కోట్లు రూపాయలు వస్తున్నా సరే.. మళ్లీ కొనుగోలు చేస్తున్నారని అన్నారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకు ఎప్పుడు కొందరు సిద్ధంగా ఉంటారని.. కానీ అధికారులు, ప్రభుత్వం వారిని సరైన దిశలో నడిపించాలని సూచించారు. రైతులకు కష్టాలు రాకుండా చూస్తుకుంటున్న సీఎం కేసీఆర్ మహానుభావుడు అని కొనియాడారు.

కొన్ని పార్టీలు రైతులను మోసం చేసేందుకు మభ్య పెట్టే హామీలు ఇస్తున్నాయని ఎర్రబెల్లి మండిపడ్డారు. వారి మాటలు నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు. ఆయిల్ ఫామ్ లాభసాటిగా ఉందని.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెబుతున్న కుట్రపూరిత హామీలను పట్టించుకోవద్దని మంత్రి సూచించారు. అనంతరం మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. రైతులు కేవలం వరి పంటనే కాకుండా.. లాభసాటి పంటలపై కూడా దృష్టిసారించాలన్నారు. దేశంలో అన్నదాతలకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని.. సాగునీటితోపాటు పెట్టుబడి కూడా అందిస్తున్నామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.