యాప్నగరం

పాఠాలు బోధిస్తూనే ప్రాణాలు విడిచిన టీచర్.. హనుమకొండలో విషాదం

హనుమకొండలోని సిద్ధార్థ్ హైస్కూల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఉషశ్రీ అనే తెలుగు టీచర్ క్లాస్‌రూమ్‌లో పాఠాలు బోధిస్తూనే ప్రాణాలు విడిచింది. దీంతో అందరూ విషాదంలో మునిగిపోయారు.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 7 Sep 2022, 3:58 pm

ప్రధానాంశాలు:

  • హనుమకొండలో విషాదం
  • పాఠాలు బోధిస్తూనే ప్రాణాలు విడిచిన టీచర్
  • విషాదంలో స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Hanumakonda Teacher
నిత్యం పాఠాలు బోధించే బడిలోనే ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు విడిచిన విషాద ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది. రోజూ మాదిరిగానే స్కూల్‌కి వచ్చిన టీచర్ తనకు అలసటగా ఉందని, ఒళ్లంతా చెమటలు పట్టేస్తున్నాయని, చేతులు లాగుతున్నాయని చెబుతూ తరగతి గదిలో నుంచి బయటకు వచ్చింది. ఈ విషయం తెలుచుకున్న స్కూల్ యాజమాన్యం ఆస్పత్రికి తీసుకెళ్లోలోపే ప్రాణం పోయింది.
హనుమకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన చెరుకుపల్లి ఉషశ్రీ(45) యాదవ నగర్‌లోని సిద్దార్థ హైస్కూల్‌లో 12 ఏళ్లుగా తెలుగు టీచర్‌గా పనిచేస్తోంది. రెండ్రోజులుగా అస్వస్థతగా ఉన్న ఆమె మంగళవారం విధులకు హాజరైంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒంట్లో అలసటగా ఉదంటూ క్లాస్‌రూమ్‌ నుంచి బయటకు వచ్చింది. ఆమెను గమనించి సహచరులు ఏమైందని ప్రశ్నించేలోపే స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో పాఠశాల యాజమాన్యం, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.