యాప్నగరం

కోహ్లీ కూతురి కోసం 8నెలలు వేచి చూసిన వీరాభిమాని

విరుష్క జంట ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు. కోహ్లి భార్య అనుష్క ఆడబిడ్డకు జన్మనిచ్చారు. సోమవారం తమ గారాల పట్టికి వామిక అనే పేరు కూడా పెట్టుకున్నారు.

Samayam Telugu 2 Feb 2021, 10:29 am
టీమిండిమా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు ఇటీవలే ఓ పాప పుట్టిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీకి దేశ వ్యాప్తంగా ఎందరూ వీరాభిమానులు ఉన్నారు. అయితే తెలంగాణకు చెందిన ఓ అభిమాని మాత్రం కోహ్లీపై తనకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. ఎనిమిది నెలలు ఆగి కోహ్లి కూతురికి పెట్టిన పేరునే తన కూతురికి పెట్టుకున్నాడు ఈ ఫ్యాన్.
Samayam Telugu విరాట్ కొహ్లి కూతురు
virat kohli baby


వరంగల్ జిల్లా రాయపర్తి మండలం, మైలారం శివారు తండాకి చెందిన బానోత్ సంతోష్.. విరాట్‌ కోహ్లికి వీరాభిమాని. సంతోష్‌ దంపతులకు గత సంవత్సరం జూన్‌ 15న అమ్మాయి పుట్టింది. అయితే విరాట్‌ కోహ్లి- అనుష్క దంపతులకు పుట్టబోయే బిడ్డకు పెట్టే పేరునే తన కూతురికి కూడా పెట్టుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు. అప్పటినుంచి ఎనిమిది నెలలు వేచి చూశాడు. సోమవారం తాజాగా కోహ్లి దంపతులు తమ బిడ్డకు ‘'వామికా’గా నామకరణం చేయటంతో.. సంతోష్‌ కూడా తన కూతురుకి కూడా ‘వామిక’ అనిపేరు పెట్టాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.