యాప్నగరం

తిక్క కుదిరిందిలే అనుకున్న ప్రియురాలు.. సరిగ్గా పెళ్లికి ముందు.. ప్రియుడి ట్విస్ట్

రెండేళ్లు ప్రేమించి.. పెళ్లి చేసుకోమంటే మాయమాటలు చెప్పి తప్పించుకునేవాడు. ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో దిగొచ్చాడు. తిక్క కుదిరిందనుకుంటే ఇంతలోనే మరో మెలిక పెట్టడంతో ఆమె ఆగ్రహానికి గురైంది.

Samayam Telugu 22 Mar 2021, 8:44 pm
రెండేళ్లు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనగానే ఏవో సాకులు చెబుతూ వచ్చాడు. ప్రియురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో దిగొచ్చిన ప్రియుడు పెళ్లికి ఒప్పుకున్నాడు. తీరా అన్ని ఏర్పాట్లు చేశాక పెళ్లికి ముందు మెలిక పెట్టాడు. ఆగ్రహం చెందిన ప్రియురాలు మహిళా సంఘాలతో దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈ ఘటన ములుగు జిల్లాలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
thali


వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన యువతి.. ములుగు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన సంతోష్‌ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతి పెళ్లి ప్రతిపాదన తీసుకురాగానే సంతోష్ ఏవో కుంటిసాకులు చెబుతూ దాటవేస్తూ వచ్చాడు. సరైన సమాధానం రావడం లేదని అప్రమత్తమైన ప్రియురాలు పోలీసులను ఆశ్రయించింది. వరంగల్ ఇంతేజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్టేషన్ మెట్లెక్కడంతో చేసేది లేక పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు.

తీరా వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశాక ఊహించిన మెలిక పెట్టాడు. తాను పెళ్లి చేసుకోనంటూ భీష్మించాడు. ప్రియుడి నిర్వాకంతో ఆగ్రహం చెందిన యువతి ఊహించని షాకిచ్చింది. ఈసారి ఏకంగా అతని ఇంటిపై పోరుకి దిగింది. మహిళా సంఘాల నేతలు, కుటుంబ సభ్యులతో కలసి వచ్చి అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.