యాప్నగరం

హైదరాబాద్‌లో ప్రియుడు, ఊళ్లో పిల్లల తండ్రి.. ఊహించని షాక్‌తో యువతి.!

బీటెక్ చదివి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న యువతి సొంతూరికి చెందిన యువకుడిని ప్రేమించింది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్ కారణంగా ఊళ్లోనే ఉండడంతో ప్రియుడి బాగోతం బయటపడింది.

Samayam Telugu 12 Feb 2021, 2:18 pm
ఉన్నత చదువులు చదివి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న యువతికి సొంతూరు యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో సాన్నిహిత్యం పెరిగింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. ప్రియుడు పెళ్లి చేసుకుంటాననడంతో ప్రియురాలు నమ్మేసింది. ఈలోగా కరోనా లాక్‌డౌన్ కారణంగా యువతి ఇంటికొచ్చేసింది. వర్క్‌ ఫ్రం హోం చేసుకుంటూ ఊళ్లోనే ఉన్న ఆమెకు ఊహించని షాక్ తగిలింది. సొంతూళ్లో ప్రియుడి బాగోతం తెలియడంతో భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
woman


నర్సంపేటలోని ఎన్జీవోస్ కాలనీకి చెందిన కావ్య(పేరుమార్చాం) బీటెక్ పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు నర్సంపేటకి చెందిన జమీల్ అహ్మద్ అలియాస్ అజ్జుతో హైదరాబాద్‌లో పరిచయమైంది. ఒకే ఊరు కావడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమకు దారితీసింది. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో కరోనా లాక్‌డౌన్ విధించడంతో కావ్య నర్సంపేటకి వచ్చేసింది. ఇంటి వద్దే ఉంటూ వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న కావ్యకి ఊహించని విషయం తెలిసింది. ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో ప్రియుడి బాగోతం బట్టబయలైంది.

ప్రియుడు అజ్జు‌కి గతంలోనే వివాహం జరిగిందని.. అతనికి పిల్లలు కూడా ఉన్నారని తెలియడంతో తట్టుకోలేకపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రియుడి మోసం చేశాడని తెలిసి మానసికంగా కుంగిపోయింది. ప్రియుడి మోసాన్ని భరించలేక దారుణ నిర్ణయం తీసుకుంది. తీవ్రమనస్థాపంతో ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.