యాప్నగరం

వివాదంలో ఎమ్మెల్యే తమ్ముడు.. న్యాయం చేయకుంటే ఆత్మహత్యే గతంటూ డీసీపీని ఆశ్రయించిన మహిళ

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య తమ్ముడైన సురేశ్‌ కుమార్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఇంటి అనుమతుల కోసం వెళ్తే స్టేషన్‌ఘన్‌పూర్‌ సర్పంచ్‌ అయిన సురేశ్ కుమార్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఓ మహిళ జనగామ డీసీపీకి ఫిర్యాదు చేశారు.

Authored byRaj Kumar | Samayam Telugu 21 Apr 2022, 12:38 pm
స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య తమ్ముడైన సురేశ్‌ కుమార్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఇంటి అనుమతుల కోసం వెళ్తే స్టేషన్‌ఘన్‌పూర్‌ సర్పంచ్‌గా ఉన్న సురేశ్ కుమార్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ స్థానిక మహిళ ఒకరు జనగామ డీసీపీ సీతారామ్‌కు ఫిర్యాదు చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌లో మార్చి 28న ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని డీసీపీతో గోడు వెళ్లబోసుకున్నారు.
Samayam Telugu డీసీపీ కార్యాలయం


స్టేషన్‌ఘన్‌పూర్‌లో 20 ఏళ్ల కింద ప్రభుత్వం తమకు ఇంటి స్థలం ఇచ్చిందని బాధిత మహిళ మీడియాతో చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పట్లో పునాది కట్టి వదిలేశామని.. ప్రస్తుతం ఆ స్థలంలో ఇంటిని నిర్మించుకోవడానికి సర్పంచ్ అయిన సురేశ్‌ను సంప్రదించగా.. అది రోడ్డు స్థలమని.. పర్మిషన్‌ కావాలంటే రూ.2 లక్షలు లంచం ఇవ్వాలన్నారని ఆమె ఆరోపించారు.

నెల కింద గ్రామ పంచాయతీకి వెళ్లగా చేయి పట్టుకొని లోపలికి లాక్కెళ్లబోయాడని బాధిత మహిళ చెప్పారు. తాను విదిలించుకొని బయటికి వచ్చేశానన్నారు. ఈ ఘటనపై మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానన్నారు. ఇప్పటికైనా న్యాయం చేయకుంటే తనకు ఆత్మహత్యే గతని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇటు డీసీపీ సీఐ శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా.. సదరు మహిళ నిర్మిస్తున్న ఇంటికి పర్మిషన్‌ లేకపోవడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది వెళ్లి కూలగొట్టారని.. దీనిపైనే ఆమె భర్త ఫిర్యాదు ఇచ్చారని చెప్పుకొచ్చారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.