యాప్నగరం

వరంగల్‌లో విషాదం.. వేధింపులతో యువతి ఆత్మహత్య

రాజేష్ అర్చన వెంట పడ్డాడు. తనను ప్రేమించాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో రాజేష్ వేధింపులు భరించలేక అర్చన తన ప్రాణం తీసుకుంది.

Samayam Telugu 12 Jan 2021, 9:42 am
వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. యువకుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. వివారాల్లోకి వెళ్తే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేటలో ఇసంపల్లి రాజేష్ అనే యువకుడు... అదే గ్రామానికి చెందిన అర్చన అనే యువతి వెంట పడ్డాడు. ఆమెను గత ఆరు నెలలుగా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆ వేధింపులు భరించలేకే అర్చన ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Samayam Telugu ప్రేమ వేధింపులు యువతి ఆత్మహత్య


అర్చన ఆత్మహత్యకు పాల్పడటం చూసిన ఆమె సోదరుడు హుటాహుటిన ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. చికిత్స పొందుతూ అర్చన మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజబాబు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడ్ని కూడా విచారించే పనిలో పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.