యాప్నగరం

ఎవరిని అడిగి సంతకం పెట్టావ్ కేసీఆర్.. రైతులను బావిలో పడేసి మళ్లీ మొత్తుకుంటున్నావా?: షర్మిల

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబట్టారు. మీ ఇష్టం వచ్చినట్లు సంతకం పెట్టి ఇప్పుడేమో కేంద్రమే ధాన్యాన్ని కొంటలేదంటావా అని ఫైర్ అయ్యారు.

Samayam Telugu 10 Apr 2022, 3:13 pm
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ‘అయ్యా కేసీఆర్.. మీ ఇష్టం వచ్చినట్లు సంతకం పెట్టి ఇప్పుడేమో కేంద్రమే ధాన్యాన్ని కొంటలేదంటున్నావ్.. నువ్వు అసలు ఎవరిని అడిగి సంతకం పెట్టావ్..’ అని పశ్నించారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర మహబూబాబాద్ జిల్లాలో సాగుతోంది. ఆదివారం గార్ల మండలం పుల్లూరు గ్రామపంచాయతీలో మహా ప్రస్థాన సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రైతులను సీఎం కేసీఆర్ బావిలో పడేసి మళ్లీ ఆయనే రక్షించమంటూ మొత్తుక్కుంటున్నాడని దుయ్యబట్టారు. వెంటనే ఉద్యోగాల భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలు, రైతులతో ఆడుకుంటున్నాయని ఫైర్ అయ్యారు.
Samayam Telugu పాదయాత్రలో షర్మిల



పాదయాత్రలో భాగంగా షర్మిల.. గుడిసెల్లో ఉంటున్న పేదలను పలకరించారు. ‘దొర గారేమో పొద్దున ప్రగతిభవన్, సాయంత్రం ఫామ్ హౌస్‌‌లో సేదతీరాలి. ప్రజలేమో రేకుల షెడ్లు, గుడిసెల్లో బిక్కుబిక్కుమంటూ జీవించాలి. ఇదేనా మీరు చెప్పిన బంగారు తెలంగాణ రూపం? ప్రజల యోగక్షేమాలు తెలుసుకోలేని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ప్రజలు ఆలోచన చేయాలి. నియంత పాలనను తరిమికొట్టాలి..’ అని ఓ ట్వీట్‌లో దుయ్యబట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.