యాప్నగరం

తెలంగాణలో తాజాగా 2123 కరోనా పాజిటివ్ కేసులు

తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 305 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.60శాతంగా ఉండగా, రికవరీ రేటు 81.02శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వివరించింది.

Samayam Telugu 19 Sep 2020, 9:46 am
తెలంగాణా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. నిత్యం రెండువేలు దాటి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,123 మంది కొత్తగా వ్యాధిబారిన పడ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. 54,459 పరీక్షలు చేయగా ఈ స్థాయిలో బయటపడ్డాయి. నిన్న ఒక్కరోజే 2,151 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 81.23 శాతానికి చేరింది.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
Telangana corona cases


Read More:
యువతిపై సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం

దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,69,169కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,37,500కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,636 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 1025కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,37,508 మంది కోలుకున్నారు. 30,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 24,34,409 పరీక్షలు చేశారు. నిన్న ఒక్కరోజే అత్యధికంగా జీహెచ్ఎంసీ 305, రంగారెడ్డి 185, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 149, నల్గొండ 135 కేసులు నమోదు అయ్యాయి. ఇంకా , 1207 ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.