యాప్నగరం

Smriti Irani: స్మృతి ఇరానీ ఎవరో ఇప్పటికైనా తెలిసిందా ?

తాజా లోక్ సభ ఎన్నికల ఫలితాలలో అమెథీలో రాహుల్ గాంధీ మీద బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ విజయం సాధించడంతో ప్రియాంక గాంధీకి అంత గర్వం పనికిరాదని సూచిస్తూ నెటిజన్లు పాత వీడియో పోస్ట్ చేశారు.

Samayam Telugu 23 May 2019, 7:34 pm
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. వరుసగా రెండో పర్యాయం నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. దేశ వ్యాప్తంగా బీజేపీ గాలి బాగ వీయడంతో ఉద్ధండులు సైతం ఓటమి చవి చూడకతప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో అధికారిక పదవితో పాటు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను గెలిపించే కీలక బాధ్యతలు స్వీకరించినా ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీకి విజయాన్ని అందించలేకపోయారు.
Samayam Telugu Priyanka Gandhi and Smriti Irani


ఈ క్రమంలో గతంలో ఎన్నికల నేపథ్యంలో ప్రియాంక చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచన స్మృతి ఇరానీ గురించి ప్రస్తావించగా.. ఆమె ఎవరు అంటూ ప్రియాంక గాంధీ అపహాస్యం చేశారు. తాజా ఎన్నికల ఫలితాలలో అమెథీలో రాహుల్ మీద బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ విజయం సాధించడంతో అంత గర్వం పనికిరాదని కొందరు సూచిస్తూ వీడియో పోస్ట్ చేశారు.

స్మృతి ఇరానీ ఎవరో ఇప్పుడైనా తెలిసిందా అని, ఇకనుంచీ స్మృతి ఇరానీ ఎవరో ప్రియాంక కచ్చితంగా గుర్తుంచుకుంటారంటూ నెటిజన్లు తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు. అమేథీలో రాహుల్ ఓటమి తర్వాత ఈ ట్రోలింగ్ మొదలైంది. మరోవైపు అమేథీలో తన ఓటమిని అంగీకరించిన రాహుల్ గాంధీ.. తన ప్రత్యర్థి స్మృతి ఇరానీకి అభినందనలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.