యాప్నగరం

తమిళనాడు సీఎం సీటుకు, బస్సుకు లింకేటబ్బా?

తమిళనాడులో ముఖ్యమంత్రి పీఠం... ఎట్టకేలకు జయలలిత స్నేహితురాలు శశికళకే దక్కింది. అయితే, ఆమె ఆ హోదాకు తగదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

TNN 6 Feb 2017, 5:34 pm
తమిళనాడులో ముఖ్యమంత్రి పీఠం... ఎట్టకేలకు జయలలిత స్నేహితురాలు శశికళకే దక్కింది. అయితే, ఆమె ఆ హోదాకు తగదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరో వైపు తమిళనాడులో ప్రస్తుత పరిస్థితిపై సోషల్ మీడియాలో సెటైర్లు హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా పన్నీర్ సెల్వం పరిస్థితిపై జాలి చూపుతూ... పలు జోకులు పుట్టుకొచ్చాయ్. వాటిలో కొన్ని మీ కోసం...
Samayam Telugu social humour jokes on tamilnadu cm post
తమిళనాడు సీఎం సీటుకు, బస్సుకు లింకేటబ్బా?


సీఎం సీటు.. ఆర్టీసీ బస్సులో లేడీస్ సీటు

మిళనాడులో ఓ.పన్నీర్ సెల్వాం పరిస్థితి.. ఆర్టీసీలో ఆడాళ్ల సీట్లో కూర్చున్న పురుషుడిలా ఉంది. లేడీస్ వస్తే ఆయన సీటు నుంచి లేచి నుంచోవాలి, ఆమె వెళ్లిపోతే.. మళ్లీ కూర్చోవాలి.

ఓపీఎస్... యూపీఎస్ రెండూ ఒకటే!

.పన్నీర్ సెల్వాం, యూపీఎస్ ఒకటేనంట. పవర్ లేనప్పుడు మాత్రమే ఇవి పనిచేస్తాయి. పవర్ వస్తే పనిచేయవు.

పరీక్ష పరీక్షకో సీఎం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు?
క్వార్టర్లీ పరీక్షలో: జయలలిత
హాఫ్ ఇయర్లీ పరీక్షలో: ఒ.పన్నీర్ సెల్వా
ఆన్యువల్ పరీక్షలో: శశికళ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.