యాప్నగరం

సుష్మా ప్రసంగం... ట్విట్టర్లో వీరంగం

యూఎన్ సదస్సులో పాక్ కు గట్టిగా సమాధాన మిచ్చారు సుష్మా.

TNN 27 Sep 2016, 5:42 pm
 న్యూయార్క్‌లోని ఐరాస సదస్సులో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ధాటిగా ప్రసంగించారు. అబద్ధాల కోరులా మారిన పాక్ శైలిని ఎండగట్టారు. ‘మేం స్నేహం కోసం చేయి చాస్తే... ప్రతిగా పఠాన్ కోట్, యూరీ ఉగ్రదాడులు మాకు దక్కాయి. ఇలాంటి దాడుల ద్వారా కాశ్మీర్ గెలవాలనుకుంటే అది పాక్ కంటున్న కల మాత్రమే’ అని కాశ్మీర్ కలుపుకోవడం అసాధ్యమని పాక్ కు గట్టిగా చెప్పారు. ‘ఓ దేశం ఉగ్రవాద భాష మాట్లాడుతోంది. ఉగ్రవాదాన్ని పోషిస్తోంది. విస్తరిస్తోంది. ఉగ్రవాదులను పక్కదేశానికి ఎగుమతి చేస్తోంది. ఉగ్రవాదానికే చిరునామా అయ్యింది. అటువంటి దేశాన్ని ఏకాకిని చేయాలి’ అని గట్టిగా పిలుపునిచ్చారు. ఆమె ప్రసంగానికి మనమంతా ముగ్దులైతే... పాకిస్థాన్‌లో మాత్రం వణుకు పుట్టిందట. సుష్మా ప్రసంగాన్ని ఉద్దేశించి ట్విట్టర్లో మన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు, ట్వీట్లు చేశారు. అవి కాసేపు నవ్వుకునేందుకు మీకోసం...
Samayam Telugu sushma swarajs powerful speech at un breaks twitter
సుష్మా ప్రసంగం... ట్విట్టర్లో వీరంగం



పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఐరాస సదస్సులో ప్రసంగించే ముందు  సుష్మా స్వరాజ్ ఇలా సిద్ధమయ్యారు .


పాకిస్థాన్ లో కరెంటు లేదు... సుష్మా ప్రసంగం కూడా వారు విని ఉండరు



సుష్మా ప్రసంగం విన్నాక పాక్ బాగా భయపడిపోయింది మరి. 



 సుష్మా చెప్పినట్టు మిగతా పిక్చర్ కోసం అర్నబ్ గోస్వామి న్యూస్ అవర్‌లో చూడండి.



 అయ్యో ముఖ్యమైన పార్ట్ మిస్సయ్యిందే...



 యాహూ... యూరీ దాడులపై ప్రతీకారం తీర్చుకున్నాం.


 
ఆ దేశం పేరు బయటికే చెప్పొచ్చుగా... ఎందుకు చెప్పలేదో?


భారత్ తమతో మాటల యుద్ధానికి రమ్మని పాకిస్థాన్ కు ప్రతిపాదిస్తే బాగుంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.