యాప్నగరం

ఇలా చేస్తే పీవీ సింధు రాష్ట్రం తెలిసిపోతుంది

ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధుది తమ రాష్ట్రమంటే తమ రాష్ట్రమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు గొప్పలకుపోతున్నాయి.

TNN 25 Aug 2016, 10:04 am
ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధుది తమ రాష్ట్రమంటే తమ రాష్ట్రమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు గొప్పలకుపోతున్నాయి. సింధు పుట్టింది హైదరాబాద్ లోనే గనుక ఆమె తెలంగాణ బిడ్డ అని ఒకరంటే...సింధు తల్లిదండ్రులు పుట్టింది ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి ఆమె ఆ రాష్ట్రానికి చెందినవారవుతారని మరొకరంటున్నారు.
Samayam Telugu ways to deterimine pv sindhus state
ఇలా చేస్తే పీవీ సింధు రాష్ట్రం తెలిసిపోతుంది


ఇంతకీ సింధు స్థానికత తెలియాంటే ఈకింద పేర్కొన్న 9 పరీక్షలను పెడితే పరిష్కారం దొరుకుతుంది.


1. బొమ్మా? బొరుసా?:


పీవీ సింధు ఏ రాష్ట్రమేదో తెలుసుకోవాలంటే రూపాయి నాణెన్ని బొమ్మా? బొరుసా? వేస్తే తెలిసిపోతుంది. హెడ్ పడితే సింధు సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, టెయిల్ (తోక) వస్తే తెలంగాణ.

2. డ్యూక్‌వర్త్ లూయిస్ మెథడ్:

పీవీ సింధు ఎక్కడ ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిందో...అదే ఆమె సొంతగడ్డ.

3. ఫిల్మీ వే:

పూల మొక్కలోని ఒక్క రేకును ఆంధ్రప్రదేశ్ (ఆల్పబేట్ ప్రకారం), తర్వాత తెలంగాణ అనుకుంటూ తెంచేయాలి. చివరికి ఏ రాష్ట్రం పలికే దగ్గర రేకు మిలిగిపోతుందో అదే సింధు సొంత రాష్ట్రం.

4. ప్రజాస్వామ్యం:

ఆమె రాష్ట్రీయతపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే..ప్రజలే ఆమె సొంతరాష్ట్రాన్నినిర్ణయిస్తారు.

5. ధోనీ దారిలో:

టీమిండియాకు కెప్టెన్ పగ్గాలు సీనియరిటీ లేదా వంతుల వారీగా చేపట్టినట్లు..సింధు స్థానికత కూడా వంతులవారీగా మార్చితే సరిపోతుంది.

6. ఇద్దరు ‘చంద్రుల’ మధ్య పోటీ:

ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య బ్యాడ్మింటన్ పోటీ పెడితే ఎవరు మ్యాచ్ గెలిస్తే వారి రాష్ట్రమే సింధు రాష్ట్రం.

7.చరిత్రకారుల సలహా:


రామచంద్ర గుహ లాంటి చరిత్రకారులను అడిగితే సింధు స్థానికతను ఇట్టే తేల్చేస్తారు.

8. అరవింద్ కేజ్రీవాల్ ఫార్ములా:

ఆంధ్రప్రజలు బేసి సంఖ్య, తెలంగాణ ప్రజలు సరిసంఖ్యలతో సింధు తమ ఓటరు అంటే తమ ఓటరంటూ క్లయిమ్ చేసుకోవచ్చు.

9. కబీర్ ఖాన్ ఫార్ములా:

ఏరాష్ట్రమో చెప్పలేకపోతే, చెప్పడంలో ఇబ్బందులుంటే సింఫుల్‌గా ఇండియన్ అంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరికనట్టే.

గమనిక: పైన పేర్కొన్నవి కేవలం వ్యంగ్యానికి మాత్రమే. ఎవరినీ కించపరిచాలనే ఉద్దేశ్యంతో కాదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.