యాప్నగరం

Yash Chopra: 50 ఏళ్ల యష్ రాజ్ ఫిలిమ్స్‌.. తండ్రిని గుర్తుచేసుకుంటూ ఆదిత్య చోప్రా కామెంట్స్

యష్ రాజ్ ఫిలిమ్స్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తండ్రిని గుర్తుచేసుకుంటూ సంస్థ ఎదిగిన తీరు వివరించారు ఆదిత్య చోప్రా.

Samayam Telugu 27 Sep 2020, 3:26 pm
దశాబ్దాల కాలంగా యష్ రాజ్ ఫిలిమ్స్‌ ఎన్నో విజయవంతమైన సినిమాలను చిత్రసీమకు అందించింది. ఇంతింతై అన్నట్లు భారీ నిర్మాణ సంస్థగా అవతరించింది. 1970 సెప్టెంబర్ 27 సరిగ్గా ఈ రోజే యష్ చోప్రా ఈ యష్ రాజ్ ఫిలిమ్స్‌కి పునాది వేశారు. అయితే ఈ సంస్థ స్థాపించి నేటితో 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దశాబ్దాల జర్నీ గుర్తుచేసుకుంటూ తన తండ్రి యష్ చోప్రా జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు ఆదిత్య చోప్రా.
Samayam Telugu Yash Chopra


''BR ఫిలిమ్స్‌లో ఉద్యోగిగా ఉన్న మా నాన్నగారు యష్ చోప్రా ఆ ఉద్యోగం మానేసి 1970లో కొత్త కంపెనీ ప్రారంభించారు. అప్పటి వరకు ఆయనకు BR ఫిలిమ్స్ నుండి అందే జీతం తప్పితే సొంతంగా ఏమీ లేదు. వ్యాపారం ఎలా నడపాలో కూడా తెలియని ఆయన.. యష్ రాజ్ ఫిలిమ్స్ కోసం చాలా కష్టపడ్డారు. ఆయనకు తన ప్రతిభపై, కష్టపడే మనస్తత్వంపై ప్రగాఢ విశ్వాసం ఉండేది. ఆ ధైర్యంతోనే ఆయన యష్ రాజ్ ఫిలిమ్స్ స్థాపించి ఇంతటి పెద్ద కంపెనీ చేశారు.

Also Read: Drugs Racket: సారా, శ్రద్దా కపూర్ సంచలన ఆరోపణలు.. డ్రగ్స్ కేసులో సీక్రెట్స్ బయటపెట్టిన హీరోయిన్స్

రాజ్‌కమల్ స్డూడియోస్ అధినేత శాంతారాం ఓ చిన్న రూమ్‌లో మా నాన్నకు చోటిచ్చారు. ఆ స్టూడియోలోనే ఓ చిన్న రూంలో ఆఫీసు పెట్టారు. అలా ఆ రోజు ఆయన ఓ చిన్న రూమ్‌లో పెట్టిన ఆ చిన్న కంపెనీ ఇండియాలోనే అతిపెద్ద ప్రొడక్షన్ కంపెనీగా మారుతుందని మా నాన్న కూడా ఉహించిఉండరు. ఆ నాటి నుంచి నేటివరకూ యష్ రాజ్ ఫిలిమ్స్ అదే విలువలతో ముందుకెళ్తోంది'' అని అన్నారు ఆదిత్య చోప్రా. ఈ రోజు (సెప్టెంబర్ 27) యష్ చోప్రా జయంతి కావడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.