యాప్నగరం

భూమి గుండ్రంగా తిరగడాన్ని... ప్రత్యక్షంగా చూపిస్తున్న హీరో

ప్రతీ 12సెకన్లకొక ఫోటో క్లిక్. మూడు గంటలపాటు ఫోటో క్లిక్స్. భూమి తిరగడాన్ని మనం కూడా చూడొచ్చు. స్టన్నింగ్ అంటూ అభిషేక్ ట్వీట్.

Samayam Telugu 18 Mar 2020, 12:25 pm
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ.. సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చిన్నప్పటి నుంచి అందరూ చదువుకుంటారు. అసలు ఆ కదలికల్ని కానీ... ఆ తిరగడాన్ని కానీ మనం ఎప్పుడూ ఫీల్ అయి ఉండం. భూమి గుండ్రంగా వేగంగా తిరుగుతన్నా... దాని చుట్టూ ఉన్న వాతావరణం కూడా అదే కదలికల్ని కలిగి ఉంటుంది. అందుకే మనకు భూమి కదులుతుందన్న భావన కలగదు. అయితే ఓ ఆస్ట్రో ఫోటోగ్రాఫర్ భూమి కదలికలపై వరసుగా తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నెటిజన్ షేర్ చేసిన ఈ వీడియోను బాలీవుడ్ బిగ్ బీ కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. స్టన్నింగ్ అంటూ ఆయన నెటిజన్ చేసిన ట్వీట్‌ను రిట్వీట్ చేశారు.
Samayam Telugu abhishek bachhan stunning tweet on rotation of the earth
భూమి గుండ్రంగా తిరగడాన్ని... ప్రత్యక్షంగా చూపిస్తున్న హీరో


అతుల్ కబ్సేకర్ అనే నెటిజన్... ఓ ఆస్ట్రో ఫోటోగ్రాఫర్ చేసిన ఎక్సెప్షనల్ వీడియోను షేర్ చేశాడు. అందులో మనం భూమి గుండ్రంగా ఎలా తిరుగుతుందో అన్న విషయాన్ని గమనించవచ్చు. కెమెరా పాలపుంత ముందు స్టిల్ ఫ్రేమ్‌లో ఉంచాడు. ట్రాకింగ్ మౌంట్‌ను ఉపయోగించి ఫోటోగ్రాఫర్ మూడు గంటలపాటు ... ప్రతీ 12సెకన్లకొక ఫోటోను క్లిక్ చేస్తూ వచ్చాడు. ఇందులో స్పష్టంగా భూమి తిరగడాన్ని స్పష్టంగా మనం గమనించవచ్చు.

అయితే ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అమేజింగ్ అంటూ కొనియాడుతున్నారు. మరికొందరు ఫోటోగ్రాఫర్ మ్యాజిక్ చేశాడని చెబుతున్నారు. మరికొందరు నెటిజన్స్ మాత్రం దీనికన్నా బెటర్ వీడియో ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.