యాప్నగరం

ఇప్పటివరకు నాకు ఎవ్వరూ ప్రపోజ్ చేయలేదు: దిశా పటానీ

దిశా పటానీని చూస్తే ఏ అబ్బాయికైనా మనసు జివ్వుమని లాగుతుంది. ఈపాటికి దిశాకు ఎంత ప్రపోజ్ చేసి ఉంటారో అనుకుంటాం. కానీ ఇప్పటివరకు ఎవ్వరూ తనకు ప్రపోజ్ చేయలేదట.

Samayam Telugu 1 Feb 2020, 4:32 pm
కుర్ర హీరోయిన్ దిశా పటానీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. ఆమెకు అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందంటే.. దిశా బర్త్‌డేను నేషనల్ క్రష్ డే‌గా మార్చి, ఆ ఒక్క రోజుల సెలవు ప్రకటించాలని ఓ సారి అభిమానులు నిరసన కూడా చేశారు. దిశకు ఉన్న హాట్ ఫిగర్‌కి ఈ పాటికి లక్షల్లో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయని అనుకుంటాం. కానీ అలాంటిదేమీ లేదట. ఇప్పటివరకు తనకు ఒక్క ప్రపోజల్ కూడా రాలేదని దిశ అంటున్నారు. ఈ విషయాన్ని ఆమె ఓ సందర్భంలో వెల్లడించారు.
Samayam Telugu disha patani
దిశా పటానీ


‘‘ఇప్పటివరకు నాకు ఎవ్వరూ ప్రపోజ్ చేసింది లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను టామ్ బాయ్‌లా ఉండేదాన్ని. మా నాన్న పోలీస్. దాంతో అబ్బాయిలకు నన్ను చూడాలంటేనే భయం వేసేది. ఆ తర్వాత సినిమా కెరీర్ కోసం ముంబయి వచ్చాక అసలు ప్రైవసీ లేకుండాపోయింది. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలకు వెళ్లలేను. ఎక్కువ మందితో కలవలేను. అలాంటప్పుడు ఇక నాకు ప్రేమలో పడే అవకాశం ఎక్కడుంటుంది. త్వరలో నాకు ఎవరో ఒకరు ప్రపోజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే జీవితంలో ప్రేమ లేకపోతే ఎలా? మనం బతికేదే దాని కోసం కదా. నేను ప్రేమలో పడితేనే నేనూ ఓ అమ్మాయినే అని తెలిసొస్తుంది. లేకపోతే నేను ఎప్పుడూ అబ్బాయిలా బాక్సర్స్ వేసుకుని జిమ్‌లో తెగ వర్కవుట్స్ చేస్తుంటా. ఒక అబ్బాయిని చూడగానే నాకు చెక్కిలిగింతలు కలగాలి. అప్పుడే అతనిపై నాకు ప్రేమ కలిగినట్లు. అలా జరగకపోతే అసలు ప్రేమే లేనట్లు’ అని తెలిపారు.

READ ALSO: Allu Arjun: నా రికార్డ్ మరోకరు బీట్ చేయాలని కోరుకుంటున్నా

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌తో దిశ డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి. దీని గురించి పలు మీడియా వర్గాలు ప్రశ్నించగా.. వర్కవుట్ అవ్వడంలేదని చెప్పారు. దాంతో ఇక దిశ తన ఫోకస్‌ను కేవలం సినిమాలపైనే పెట్టాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ‘మలంగ్’ సినిమాలో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
See Photo Shoot: రెచ్చిపోయిన అనుష్క శర్మ.. సెక్సీ ఫొటోలు వైరల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.