యాప్నగరం

బరువు పెరగడంపై షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన ఇలియానా

ఒకప్పుడు సన్నజాజి తీగలా సెక్సీగా ఉండే ఇలియానా ఒక్కసారిగా లావైపోయారు. ఇందుకు కారణమేంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.

Samayam Telugu 22 Nov 2019, 11:00 pm
గోవా బ్యూటీ ఇలియానా లాంటి నడుము, ఫిగర్ ఉండాలని కోరుకోని అమ్మాయి ఉండదు. ఒకప్పుడు సన్నగా, అందంగా అమ్మాయిని పొగడాలంటే ఇలియానానే ఉదాహరణగా తీసుకునేవారు. కానీ కొన్నాళ్ల తర్వాత ఇలియానా బాగా లావైపోయారు. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో ఇలియానా శరీరంలో వచ్చిన మార్పులు చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. అయితే తాను ఉన్నట్టుండి వెయిట్ పెరగడానికి కారణమేంటో ఇలియానా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Samayam Telugu ileana
ఇలియానా

ఇలియానా

ఇలియానా ఒకప్పుడు డిప్రెషన్‌తో చాలా బాధపడేవారు. ఈ విషయాన్ని ఆమె చాలా సార్లు మీడియా ముందు బయటపెట్టారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సన్నగా ఉన్న తన ఫిగర్‌ను చూసి ఎవరైనా కామెంట్ చేస్తారేమోనని చాలా బాధపడేదాన్నని తెలిపారు. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చేవని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ట్రీట్‌మెంట్ తీసుకోవడం మొదలుపెట్టారు. అలా రోజుకు పన్నెండు ట్యాబ్లెట్స్ వేసుకుని నిద్రపోయేవారట. అందువల్ల తన శరీరంలో మార్పులు వచ్చి బరువు పెరిగిపోయానని తెలిపారు. ఆ తర్వాత ఆ బరువు తగ్గించుకోవడానికి జిమ్‌కు వెళ్లేదాన్నని, ఆ సమయంలో మీడియా చాలా ఫొటోలు తీసిందని పేర్కొన్నారు. ఆ ఫొటోలు బయటికి రావడంతో తనను సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేశారని బాధపడ్డారు.

ఇలియానా

READ ALSO: హీరోయిన్ రేప్ నాటకం, బండారం బయటపెట్టిన మేనేజర్
ఇప్పుడు మళ్లీ సన్నజాజిలా మారిపోయారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలకు మళ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. బీచ్‌లో బికినీల్లో తన అందాలను ఆరబోస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూతో విడిపోయాక ఇలియానా తన పూర్తి ఫోకస్‌నను సినిమాలపైనే పెట్టారు. ప్రస్తుతం ఆమె ‘పాగల్ పంతి’ అనే సినిమాలో నటించారు. త్వరలో సినిమా రిలీజ్ అవ్వబోతోంది. తెలుగులోనూ ఆమె త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

READ ALSO: ప్చ్ Prabhas.. 2019 మోస్ట్ ట్రోల్డ్ సినిమా ఆయనదే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.