యాప్నగరం

Kangana Ranaut: ముఖ్యమంత్రితో భేటీ కానున్న కంగనా రనౌత్.. రాజకీయాల్లోకి ఎంట్రీ..?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)తో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) సమావేశం కానున్నారు. ఆమె రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

Authored byAshok Krindinti | Samayam Telugu 30 Sep 2022, 6:21 pm
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. శనివారం ఆమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)తో భేటీ కానుండడంతో ఈ పుకార్లు పుట్టుకోస్తున్నాయి. రేపు ఏక్‌నాథ్ షిండే అధికారిక నివాసంలో కంగనా సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రితో చాలా విషయాలపై ఆమె మాట్లాడబోతున్నట్లు తెలిసింది. రాజకీయాలపై ఎప్పటికప్పుడు కంగనా తనదైన శైలిలో స్పందిస్తుంటారు.
Samayam Telugu Kangana Ranaut
కంగనా రనౌత్


గతంలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని ఎన్నోసార్లు విమర్శలు గుప్పించారు కంగనా. శివసేప పార్టీ నేతలు కూడా ఆమె అదేస్థాయిలో ఫైర్ అయ్యారు. శివసేన, కంగనా మధ్య ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి.

ఆ తరువాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినందుకు ఏక్నాథ్ షిండేకు అభినందనలు తెలిపారు కంగనా. 'ఎంత స్ఫూర్తిదాయకమైన విజయం సాధించిన కథ.. ఆటో రిక్షా నడపడం నుంచి దేశంలో అత్యంత ముఖ్యమైన, శక్తివంతమైన వ్యక్తులలో ఒకరిగా ఎదగడం చాలా గ్రేట్.. అభినందనలు సర్..' అంటూ కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ఇప్పుడు అందరి దృష్ణి ఏక్‌నాథ్‌ షిండే-కంగనా రనౌత్ సమావేశం కీలకంగా మారింది. అందరి చూపు ఈ భేటీపైనే ఉంది. కంగనా రాజకీయాల్లోకి వస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆమె అడుగులు ఎటు వైపు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయాలపై చర్చించనున్నారా.. లేదా మరేదైనా కారణం ఉందా అనే విషయం రేపు భేటీ తరువాత తెలియనుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్ 'ఎమర్జెన్సీ' మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కంగనా స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పలువురు సినీ ప్రముఖుల ఫస్ట్‌లుక్‌లు విడుదలయ్యాయి. అదేవిధంగా కంగనా ప్రొడక్షన్ హౌస్‌లో రూపొందిన టికు వెడ్స్ శేరు మూవీ కూడా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవ్నీత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.