యాప్నగరం

సొరచేపతో అందాల పాప జలకాలు.. షేక్ చేస్తున్న వీడియో

వామ్మో సొరచేపను చూస్తేనే బెంబేలెత్తిపోతారు. తోకతో ఒక దెబ్బ కొట్టింది అంటే పెద్ద పెద్ద షిప్‌లే షేక్ అవుతాయి. అలాంటి సొరచేపతో కలిసి జలకాలు ఆడుతోంది బాలీవుడ్ బ్యూటీ.

Samayam Telugu 9 Jun 2020, 12:58 pm
లవర్స్ డే, ఫాదర్స్, మదర్స్ డే ఇలా అన్ని స్పెషల్ డేస్‌కి ఓ రోజు ఉన్నట్టే ప్రకృతి రమణీయతకు దృశ్యరూపం అయిన మహా సముద్రాలకు ఓ స్పెషల్ డే ఉంది. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా తన మిత్రుడు (సముద్రం)ని గుర్తు చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. సముద్రంలో సొరచేపతో జలకాలుడూ జలకన్యగా వయ్యారాలు ఒలకబోస్తున్న వీడియోను షేర్ చేసింది కత్రినా.
Samayam Telugu కత్రినా కైఫ్ (Katrina Kaif And Whale Shark)
katrina kaif swimming video


లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు ఇల్లు తుడుస్తూ, పెంపుడు జంతువులతో ఆడుకుంటూ, వంటలు చేస్తూ సందడి చేస్తుండగా.. కత్రినా జలకన్యగా మారి సముద్రంలో సొరచేపతో ఈదుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ.. తనకు సముద్రంలో మిత్రుడైన సొర చేపకు శుభాంక్షలు చెప్పింది ఈ అందాల పాప. ఈ సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ ఈ డేరింగ్ వీడియోను షేర్ చేస్తూ.. ‘నా మిత్రుడితో సముద్రంలో ఓ అందమైన రోజు’ థ్రిల్లింగ్ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
View this post on Instagram #tb to A beautiful day in the ocean 🌊 with my most incredible friend 🐳 A post shared by Katrina Kaif (@katrinakaif) on Jun 8, 2020 at 4:42am PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.