యాప్నగరం

Rashmika Mandanna: సిల్లీ కారణం చెప్పి భారీ సినిమాను వదులుకుంది

సౌత్ బ్యూటీ రష్మిక మందనకు టాలీవుడ్‌లో పంట పండింది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో తన సత్తా చాటుకుంది. దాంతో రష్మికకు ఒకేసారి మూడు భారీ ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్ నుంచి కూడా పిలుపు వచ్చింది. అది కూడా స్టార్ హీరో షాహిద్ కపూర్‌కి జోడీగా నటించే అవకాశం. కానీ ఓ సిల్లీ కారణం చెప్పి రష్మిక ఈ సినిమాను వదులుకుంది.

Samayam Telugu 7 Dec 2019, 2:47 pm
సౌత్ బ్యూటీ రష్మిక మందనకు టాలీవుడ్‌లో పంట పండింది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో తన సత్తా చాటుకుంది. దాంతో రష్మికకు ఒకేసారి మూడు భారీ ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్ నుంచి కూడా పిలుపు వచ్చింది. అది కూడా స్టార్ హీరో షాహిద్ కపూర్‌కి జోడీగా నటించే అవకాశం. కానీ ఓ సిల్లీ కారణం చెప్పి రష్మిక ఈ సినిమాను వదులుకుంది.
Samayam Telugu actress rashmika mandanna said no to jersey remake citing creativity reasons
Rashmika Mandanna: సిల్లీ కారణం చెప్పి భారీ సినిమాను వదులుకుంది


జెర్సీ రీమేక్‌కి నో

తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘జెర్సీ’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తు్న్న సంగతి తెలిసిందే. హిందీలో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందనను ఎంపిక చేసుకోవాలనుకుంది చిత్రబృందం. కానీ రష్మిక నో చెప్పింది. ఇందుకు కారణం సినిమాకు ఎక్కువ పారితోషికం అడగటమేనని పలు బాలీవుడ్ వర్గాలు అన్నాయి.

అసలు కారణం చెప్పిన రష్మిక

తాను జెర్సీ రీమేక్‌కు ఒప్పుకోకపోవడానికి రష్మిక అసలు కారణం వెల్లడించారు. సినిమాలో తన పాత్రకు న్యాయం చేయలేనేమో అన్న భయంతో ఈ సినిమాకు నో చెప్పారట. ‘నేను ఓ సినిమాలో నటిస్తున్నానంటే.. నా క్రియేటివిటీని మొత్తం సినిమాలోనే పెట్టాలి. నాకు అంత స్కోప్ లేనప్పుడు నేను సినిమాకు ఒప్పుకోను. జెర్సీ రీమేక్ భారీ సినిమా. ఎవరైనా సినిమాకు ఈజీగా ఓకే చేసేస్తారు. కానీ నేను సెట్‌కు వచ్చి అలసిపోలేను. జెర్సీ రీమేక్ టీంకు ఇంతకంటే ఎక్కువ దక్కాలి. ఎవరైతే బాగా ఎనర్జిటిక్‌గా ఉంటారో వారు ఈ సినిమాలో నటించగలుగుతారు. ఒక సినిమా హిట్టయినా ఫ్లాపయినా అది హీరో, హీరోయిన్‌లు ఇద్దరిపై ప్రభావం చూపుతుంది. సినిమా అంటే కేవలం డబ్బే కాదు మనం దాని కోసం ఎంత కష్టపడుతున్నామని’ అన్నారు.

వరుసగా మూడు భారీ ప్రాజెక్ట్స్

ప్రస్తుతం రష్మిక మూడు పెద్ద సినిమాలు చేస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబుకు జోడీగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. మరోపక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘ఐకాన్’ సినిమాలో నటించనున్నారు. అంతేకాదు నితిన్‌కు జోడీగా ‘భీష్మ’ సినిమాలోనూ నటిస్తున్నారు. కెరీర్ మొదట్లోనే స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారు రష్మిక. తన సినీ జర్నీని కన్నడ సినిమాతో మొదలుపెట్టినా.. తెలుగు ప్రేక్షకులే ఆమెను బాగా ఆదరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.