యాప్నగరం

మ్యూజిక్ డైరెక్టర్ తల్లికి కరోనా.. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో షాక్!

ఇటీవలే కరోనాతో మృతిచెందిన వాజిద్ ఖాన్ (42) తల్లికి కూడా కరోనా సోకిందని తెలియడం అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Samayam Telugu 3 Jun 2020, 10:54 am
దేశంలో కరోనా విజృంభణ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే 2 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, వేల సంఖ్యలో జనం ఈ వ్యాధితో మృతిచెందారు. కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఇటీవలే కరోనా సోకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ (42) మరణించిన సంగతి తెలిసిందే. దీంతో సినీ వర్గాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. అయితే ఆ విషాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే వాజిద్ ఖాన్ తల్లి రజీనా ఖాన్‌కి కరోనా పాజిటివ్ అని తేలడంతో అంతా షాక్ అవుతున్నారు.
Samayam Telugu మ్యూజిక్ డైరెక్టర్ తల్లికి కరోనా.. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో షాక్!
Wajid khan mother


ఇప్పటికే వాజిద్ ఖాన్ మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబసభ్యులకు ఈ వార్త ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం రజీనా ఖాన్‌ ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వాజిద్ ఖాన్ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో.. తన కొడుకును చూసుకొనేందుకు రజీనా ఆసుపత్రిలోనే ఉండి సహాయపడింది. ఈ కారణంగానే ఆమెకు కూడా కరోనా సోకిందని సమాచారం.

Also read: పెళ్ళికి రెడీ అయిన నయనతార.. బాజా బజంత్రీ ఏర్పాట్లు.. ఈ సడెన్ డిసీజన్‌కి కారణాలివే!

మరోవైపు ప్రముఖ సినీ నటి కుమారి సింగ్‌తో సహా ఆమె కుటుంబం మొత్తానికి వైరస్ సోకిందని తేలింది. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించారు. తాజాగా కనిపిస్తున్న ఈ పరిస్థితులు, ఇండస్ట్రీలో పెరుగుతున్న కరోనా కేసులు సినీ వర్గాలను కలవరపెడుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.