యాప్నగరం

Tabu: టీనేజ్ నుంచే కలిసి తిరుగుతున్నాం.. ఇప్పటికీ ఏం మారలేదు.. అజయ్, టబు రిలేషన్‌షిప్

బాలీవుడ్ హీరోహీరోయిన్ల మధ్య రిలేషన్‌షిప్స్ కామన్. పైగా ఒకటి రెండు సినిమాల్లో కలిసి నటిస్తే చాలు.. వెంటనే ఆ జంట మధ్య రూమర్స్ పుట్టుకొస్తుంటాయి. అలానే చాలా ఏళ్లుగా కలిసి నటిస్తున్న అజయ్ దేవ్‌గన్, టబు.. తమ రిలేషన్‌షిప్ గురించి ఓపెన్ అయ్యారు.

Authored bySanthosh Damera | Samayam Telugu 16 Mar 2023, 8:17 pm

ప్రధానాంశాలు:

  • రిలేషన్‌షిప్‌పై అజయ్ దేవ్‌గన్, టబు కామెంట్స్
  • టీనేజ్ నుంచి ఒకరికొకరం తెలుసని స్టేట్‌మెంట్
  • ఇప్పటికీ అదే బాండింగ్ కొనసాగుతున్నట్లు వెల్లడి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ajay Devgan, Tabu
Tabu: అజయ్, టబు
బీటౌన్ స్టార్ యాక్టర్ అజయ్ దేవ్‌గన్ (Ajay Devgn) తదుపరి చిత్రం ‘భోలా’ (Bhola). ఈ చిత్రంలో తను మరోసారి టబుతో (Tabu) కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. గతేడాది ‘దృశ్యం 2’ (Drishyam2) మూవీలో జంటగా నటించిన ఈ బీటౌన్ స్టార్స్.. కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకు అనేక సినిమాల్లో కలిసి నటించారు. ఇద్దరి మధ్య మంచి రిలేషన్‌షిప్ ఉన్నప్పటికీ అజయ్.. హీరోయిన్ కాజోల్‌ను (Kajol) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ టబు మాత్రం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది. అయితే అజయ్‌తో తనకున్న రిలేషన్‌షిప్ వల్లే టబు పెళ్లి చేసుకోలేదనే రూమర్స్ ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కానీ తామిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్‌ ఉందో అజయ్, టబు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
టీనేజ్ నుంచి తాము ఒకరికొకరం తెలుసన్న అజయ్.. ఇద్దరి మధ్య కంఫర్టబుల్ ఫ్రెండ్‌షిప్ ఉందని, ఒక్కోసారి తిట్టుకుంటామని కూడా వెల్లడించారు. నిజానికి అజయ్, టబు కలిసి నటించిన మొదటి సినిమా ‘విజయ్ పథ్’ (1994). కాగా.. ఇద్దరూ ‘పెహ్లా పెహ్లా ప్యార్ (1994) చిత్రంలో ఫస్ట్ టైమ్ జంటగా నటించారు. ఆ తర్వాత ‘హకీకత్ (1995), తక్షక్ (1999), దృశ్యం (2015), గోల్‌మాల్ ఎగైన్ (2017), దే దే ప్యార్ దే (2019) తదితర చిత్రాల్లో కలిసి పనిచేశారు. అయితే, సినిమాల్లోకి రాకముందే 13-14 ఏళ్ల వయసు నుంచే టబు తనకు తెలుసన్నారు అజయ్. అప్పటి నుంచి తమ మధ్య కంఫర్టబుల్ ఫ్రెండ్‌షిప్ ఉందని, ఒకరినొకరం తిట్టుకునేంత స్వేచ్ఛ ఉందని.. ఇప్పటికీ అదేం మారలేదని చెప్పుకొచ్చారు.
Trivikram Srinivas: ‘అ’ పిచ్చి వదలని త్రివిక్రమ్.. మహేష్‌తో సినిమాకైనా సీన్ మారట్లే!
ఇక ‘భోలా’ మూవీ విషయానికొస్తే.. తమిళ్‌లో కార్తీ నటించిన ‘ఖైదీ’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇందులో అజయ్ దేవ్‌గన్, టబు సహా దీపక్ డోబ్రియాల్, సంజయ్ మిశ్రా, గజరాజ్ రావు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు అమలా పాల్, అభిషేక్ బచ్చన్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌తో పోలిస్తే.. హిందీ రీమేక్‌లో కొన్ని మార్పులు చేసినట్లు ఈ సందర్భంగా రివీల్ చేశారు అజయ్. కాగా.. 2008లో విడుదలైన ‘యు, మీ ఔర్ హమ్‌’ మూవీ దర్శకుడిగా అజయ్‌కు మొదటి సినిమా. అలాగే 2016లో వచ్చిన ‘శివాయ్’, రన్‌వే 34 (2022) చిత్రాలకు కూడా దర్శకత్వం వహిస్తూ నటించారు.


రచయిత గురించి
Santhosh Damera
సంతోష్ దామెర సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్\u200cటైన్\u200cమెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్\u200cడేట్స్, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, లైఫ్\u200cస్టైల్ స్టోరీస్, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.