యాప్నగరం

అక్షయ్ కుమార్ ఇంట్లో విషాదం.. సచిన్ ఇకలేరు

సినీ నటుడు, అక్షయ్ కుమార్ సమీప బంధువు సచిన్ గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 16 May 2020, 4:31 pm
బాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ లాంటి గొప్ప నటులను కోల్పోయిన చిత్ర సీమ తాజాగా మరో నటుడి మరణ వార్త వినాల్సి వచ్చింది. ఏక్తా క‌పూర్ న‌టించిన 'క‌హానీ ఘ‌ర్ ఘ‌ర్ కీ' సినిమాలో హీరోగా నటించిన సచిన్ కుమార్ గుండె పోటుతో కన్నుమూశారు. మే 13న పుట్టిన రోజు జరుపుకున్న ఆయన అకాల మరణం చెందడంతో ఆయన సన్నిహిత వర్గాలు షాక్ అయ్యాయి.
Samayam Telugu సినీ పరిశ్రమలో మరో విషాదం.. అక్షయ్ కుమార్ సమీప బంధువు, హీరో మృతి
Sachin Kumar passed away


సచిన్ కుమార్.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఫ్యామిలీకి సమీప బంధువు. అతని మరణవార్త తెలియగానే అక్షయ్ కుమార్ ఫ్యామిలీ హుటాహుటీన అక్క‌డికి చేరుకుంది. సచిన్ డెడ్ బాడీ చూసి ఒకింత భావోద్వేగానికి లోనైయ్యారు. సచిన్ మృతి పట్ల అక్షయ్ దిగ్బ్రఅంతి వ్యక్తం చేశారు. ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా సచిన్ మృతిపై స్పందిస్తూ తమ తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సచిన్ మృతి చెందారనే విషయాన్ని మొదట అత‌ని స్నేహితుడు రాక్‌శ్ పాల్ ధ్రువీకరించాడు. శుక్ర‌వారం ఉద‌యం సచిన్ తలుపు తీయ‌క‌పోవ‌డంతో.. అనుమానం వచ్చిన కుటుంబ స‌భ్యులు త‌లుపు పగలగొట్టగా అప్ప‌టికే ఆయన కుప్ప‌కూలిపోయి ఉన్నారని, వెంట‌నే ఆసుపత్రికి త‌ర‌లించ‌గా గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారని పేర్కొన్నాడు. ఆయ‌న మ‌ర‌ణం హృదయ విదార‌కమ‌ని, త‌మ‌కు ఎంతో లోటును మిగిల్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

Also Read: తెలిసి తెలిసి ఆ పని చేస్తానా.. బిగ్ బాస్ 4పై యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.