యాప్నగరం

పెళ్లికి సిద్ధమైన ‘చిన్నారి పెళ్లికూతురు’.. తనది అందుకు సరైన వయస్సు కాదు అంటూనే..

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో యావత్ భారతదేశ్ ప్రేక్షకులను అలరించిన నటి అవికా గోర్. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామా.. అక్కడా మంచి సక్సెస్ సాధించింది. త్వరలో ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలు ఎక్కబోతుందట.

Samayam Telugu 20 May 2021, 1:44 pm
బాలీవుడ్‌లో అవకాశాలు కరువైతే.. ఉత్తరాది సినీ భామలు ముందుగా దృష్టి పెట్టేది టాలీవుడ్‌పైనే. అలా చాలా మంది హీరోయిన్లు ఇక్కడ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్‌ని సాధించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ తమ సత్తా చాటుకున్నారు. అలా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం బిజీ నటిగా మారిపోయిన వాళ్లలో అవికా గోర్‌ కూడా ఉంది. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ‘ఉయ్యాల.. జంపాలా’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు ఆఫర్లు క్యూ కట్టాయి.
Samayam Telugu అవికా గోర్
Avika Gor


అయితే ఆ తర్వాత తెలుగుతోపాటు ఇతర ఇండస్ట్రీలోనూ హీరోయిన్‌గా చేసినా అవికాకు ఊహించినంత సక్సెస్ రాలేదు. అయినప్పటికీ.. ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఈ మధ్యే ‘దిల్ కో మేరే’ అనే మ్యూజిక్ వీడియోతో ఈ భామ ప్రేక్షకులను పలకరించింది. ఈ వీడియో మంచి సక్సెస్ సాధించింది. మరోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలోని థాంక్యూలో అవికా నటిస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్య, రాశీ ఖన్నాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిన్నారి పెళ్లికూతురు నిజంగానే పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైందట. తన ప్రియుడిని పెళ్లాడేందుకు తహతహలాడుతున్నట్లు ఈ భామ ఇటీవల వెల్లడించింది.

2019లో రోడీస్‌లో పాల్గొన్న మిలింద్ చాంద్వానీతో అవికా కొంతకాలం క్రితం ప్రేమలో పడింది. ఈ జంట ఒకరినొకరు హైదరాబాద్‌లో కలుసుకున్నారు. వారు కలిసి ఒక ఎన్జీవో కోసం పనిచేసిన క్రమంలో ప్రేమలో పడ్డారు. తాజాగా వీళ్లద్దరు ఓ పర్యటనకు వెళ్లిన ఫోటోలను షేర్ చేసిన అవికా ‘‘ప్రార్థనలకు సమాధానం లభించింది. చివరకు జీవితాంతం గడపాలని కోరుకునే నావాడిని కనుగొన్నాను’’ అని రాసింది. తమది తొలి చూపు ప్రేమ కాదని.. ఒకరి గురించి ఒకరు మంచిగా తెలుసుకున్న తర్వాత ఇష్టపడ్డామని ఆమె చెప్పింది. అయితే ఇప్పుడు తాను పెళ్లి చేసుకొవడానికి చిన్నవయస్సు అని చెబుతూనే.. తన ప్రియుడు మాత్రం పెళ్లికి సిద్ధంగా ఉన్నాడని ఆమె అంటోంది. మరి ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ నుంచి వివాహ శుభావార్త ఎప్పుడు లభిస్తుందో వేచి చూడాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.