యాప్నగరం

Akshara Singh: బిగ్ బాస్ బ్యూటీ అశ్లీల వీడియో లీక్.. నటి రియాక్షన్ ఇదే..!

భోజ్‌పురి బ్యూటీ అక్షరా సింగ్ (Akshara Singh)పై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు, ట్రోల్స్ జరుగుతున్నాయి. ఓ అశ్లీల వీడియో క్లిప్ వైరల్ అవుతుండగా.. అందులో ఉన్న మహిళ అక్షర సింగ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Ashok Krindinti | Samayam Telugu 20 Sep 2022, 8:32 am
నటనతోపాటు తన అద్భుతమైన గాత్రంతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది భోజ్‌పురి బ్యూటీ అక్షరా సింగ్ (Akshara Singh). ఆమె సినిమాలతోనే కాకుండా.. బిగ్ బాస్ ఓటీటీలోనూ పాల్గొని అభిమానులను అలరించారు. అక్షర పాటలు సోషల్ మీడియాతో యూట్యూబ్‌లో కూడా పాపులర్. తాజాగా ఈ బ్యూటీ పేరు నెట్టింట మారుమోగిపోతుంది. ఓ అశ్లీల వీడియో వైరల్ అవుతుండగా.. అందులో ఉన్న మహిళ అక్షర సింగ్ అని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమెపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి.
Samayam Telugu akshara singh
అక్షరా సింగ్


ఈ నేపథ్యంలోనే ఆ వీడియోపై అక్షరా సింగ్ స్పందించింది. 'ఇలాంటి పని ఎవరు చేశారో నాకు తెలియదు. అయితే ఈ విషయాలన్నీ నేను పట్టించుకోను. నేను ఇంకా ఆ వీడియో కూడా చూడలేదు. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియదు. ప్రస్తుతానికి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏం చేయాలనుకుంటే అది చేయండి..' అంటూ ఆమె ఘాటుగా స్పందించింది.

అయితే ఆ తరువాత ఆమెకు సంబంధించిన వీడియో కూడా యూట్యూబ్‌లో వైరల్ అయింది. అందులో అక్షర సింగ్ ఏడుస్తున్నట్లు ఉంది. అశ్లీల వీడియోకు.. ఈ వీడియోకు లింక్ పెట్టి కొంతమంది షేర్ చేశారు. అయితే ఆమె ఏడుస్తున్న వీడియో పాతది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం వీడియో అని అంటున్నారు.

అక్షరా సింగ్‌ పరువు తీసేందుకు కుట్ర జరుగుతోందని ఆమె అధికార ప్రతినిధి రంజన్ సిన్హా అన్నాడు. ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ.. అక్షరా సింగ్ ఏడుస్తున్న వీడియో చాలా పాతదని చెప్పారు. అక్షర చాలా కష్టపడి, అంకితభావంతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారని.. ఆమె పాపులారిటీ దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. జర్నలిస్టులు ఇలాంటి ఫేక్ వీడియోలు, వార్తలను నమ్మ వద్దని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.