యాప్నగరం

40 ఏళ్ల వయసులో అంత ఎక్స్‌పోజింగా.. పవన్ హీరోయిన్‌కి ధైర్యం ఎక్కువే

బాలీవుడ్ నటి మలైకా అరోరా వోగ్ అవార్డ్స్ ఈవెంట్‌కు వేసుకొచ్చిన గౌను చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా ఆమె వేసుకున్న ఆ డ్రెస్ చూసి బాయ్‌ఫ్రెండ్ ఫిదా అయిపోయాడు.

Samayam Telugu 28 Sep 2019, 11:02 am
‘వయసనేది కేవలం సంఖ్య మాత్రమే’ ఇప్పుడు ఏ హీరోయిన్ నోట విన్నా ఇదే మాట. వయసు ఎక్కువని ఫీలైతే ఎక్కడ సినిమా అవకాశాలు రావో అని అలా చెప్తారో ఏమో తెలీదు కానీ వయసు మీదపడుతున్నా క్లీవేజ్ ఎక్కువగా కనిపించే దుస్తులు వేసుకుంటున్నారు. ఇటీవల ముంబయిలో వోగ్ బ్యూటీ అవార్డ్స్ జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ నటి మలైకా అరోరా కూడా హాజరయ్యారు. వైట్ చిఫాన్ గౌను ధరించి ఈవెంట్‌కు షాకింగ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక షాకింగ్ విషయం ఈమె ఈవెంట్‌కు రావడం కాదు ఆమె వేసుకున్న డ్రెస్. ముందు ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా ఉన్న ఆ డ్రెస్ చూసి చాలా మంది అవాక్కయ్యారు.
Samayam Telugu malaika
మలైకా


READ ALSO:‘అల.. వైకుంఠపురములో..’ తొలి మెలొడీ వచ్చేసింది సిద్ శ్రీరామ్ మళ్లీ చించేశాడు

అయితే ఆమె ప్రియుడు, బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ మాత్రం ఆ డ్రెస్‌లో ఆమెను చూసి ఫిదా అయిపోయాడు. నా గర్ల్‌ఫ్రెండ్ కేక అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టాడు. 17 ఏళ్ల కుర్రాడికి తల్లైన మలైకా నాలుగు పదుల వయసులో ఇలాంటి దుస్తులు వేసుకోవడం ఏంటి అని నెటిజన్ల నుంచి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. సల్మాన్ ఖాన్ సోదరుడు, నిర్మాత అయిన అర్బాజ్ ఖాన్‌ను మలైకా పెళ్లి చేసుకున్నారు. వీరికి 17 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అర్బాజ్‌తో గొడవ పడుతున్నప్పుడు మలైకాకు అర్జున్ పరిచయమయ్యాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. అర్జున్ కంటే మలైకా వయసులో పదేళ్లు పెద్దది. ఈ విషయాన్ని అర్జున్ తన ఇంట్లో వారితో కూడా చెప్పాడు.

View this post on Instagram vogue beauty awards 2019! #gown @aadnevikofficial shot by @mohitvaru glam @mallika_bhat @priyanka.s.borkar assisted by @namdeepak #styled by @tanghavri A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on Sep 25, 2019 at 1:04pm PDT

ఆయన తండ్రి బోనీ కపూర్ మాత్రం హెచ్చరించాడు. సల్మాన్ ఖాన్ కుటుంబంతో పెట్టుకుంటే కెరీర్ లేకుండాపోతుందని, మలైకాకు దూరంగా ఉండాలని చెప్పాడు. కానీ అర్జున్ వినలేదు. అప్పటిదాకా రహస్యంగా ప్రేమాయణం సాగిస్తున్న వీరు కొన్ని నెలల క్రితం అవును మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని మీడియా ముందు బయటపెట్టేశారు. మలైకా వయసు 45 ఏళ్లు అయినప్పటికీ ఆమె క్రమం తప్పకుండా యోగా చేస్తూ తన వయసు తెలీకుండా మెయింటేన్ చేస్తున్నారు. ఆమె యాబ్స్ చూస్తే ఈ వయసులో ఇంత ఫిట్‌గా కూడా ఉండొచ్చా అనిపిస్తుంది. ఇప్పుడనే కాదు మలైకా వేసుకునే దుస్తులపై సోషల్ మీడియాలో ఎప్పుడూ కామెంట్లు వస్తూ ఉంటాయి. 17 ఏళ్ల కుమారుడిని ఇంట్లో పెట్టుకుని ఇలాంటి దుస్తులు వేసుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించండి అంటూ పలువురు నెటిజన్లు ఉచిత సలహాలు కూడా ఇస్తుంటారు.

కానీ మలైకా వాటిని అస్సలు పట్టించుకోదు. పైగా నా బాడీ నా రూల్స్ అని ఘాటుగా స్పందించి వారి నోటికి తాళం వేస్తుంటారు. ఇక మలైకా కెరీర్ విషయానికొస్తే ఆమె కేవలం ఐటెం సాంగ్స్‌కే పరిమితం అయ్యారు. ‘ఛయ్య ఛయ్య’ పాటతో బాలీవుడ్‌లో పాపులర్ అయిన మలైకా ఎన్నో ఐటెం సాంగ్స్‌లో నటించారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో ‘కెవ్వు కేక’ పాటలో ఆడిపాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.