యాప్నగరం

హాస్పిటల్‌లో చేరిన అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్ హాస్పిటల్‌లో చేరారు. రెగ్యులర్ చెకప్ కోసం ఆయన్ను వైద్యుల వద్దకు తీసుకెళ్లినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Samayam Telugu 18 Oct 2019, 1:52 pm
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను ముంబయిలోని లీలావతి హాస్పిటల్‌లో చేర్పించారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఆయన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారట. అయితే భయపడాల్సింది ఏమీ లేదని వైద్యులు తెలిపారు. ఆయన కేవలం రెగ్యులర్ చెకప్స్ కోసం మాత్రమే హాస్పిటల్‌లో చేరారని స్పష్టం చేశారు. త్వరలో ఆయన్ను డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు. హాస్పిటల్‌లో ఐసీయూలాగే అమితాబ్ కోసం ఓ స్పెషల్ రూంను కేటాయించారట. అందులోనే ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన్ను ఇంట్లోవారు తప్ప ఎవ్వరూ చూడటానికి అనుమతి లేదు.
Samayam Telugu amitabh bachchan
అమితాబ్ బచ్చన్


READ ALSO: ‘ఆ నటిని నేను చంపలేదు.. కేసు పెట్టినవారు ఎక్కడ?’

‘కూలీ’ సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్ కడుపులో ఇనుప చువ్వ గుచ్చుకుని పెద్ద ప్రమాదం జరిగింది. ఆయన బతకరనే అనుకున్నారు. కానీ దేవుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. ఈ గాయం వల్ల అమితాబ్‌కు కాలేయ సమస్య వచ్చింది. తాను కేవలం 30 శాతం మాత్రమే మిగిలున్న కాలేయంతో జీవిస్తున్నానని ఒకానొక సందర్భంలో తెలిపారు. అంతేకాదు అమితాబ్‌కు క్షయ వ్యాధి కూడా ఉంది. అందుకే క్షయ వ్యాధికి సంబంధించిన ప్రకటనల్లో ఆయన నటిస్తూ నిర్లక్ష్యం చేయకూడదని అవగాహన కల్పిస్తుంటారు. అంతేకాదు గతేడాది ఆయన ‘ఠగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా షూటింగ్ సమయంలో ఫైటింగ్ సీన్లలో నటించడం వల్ల ఎముకలు విరిగాయట. ఈ విషయాన్ని ఆయన్నే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.

READ ALSO: Deepika ఫొటోలు చూసి ఆగలేకపోతున్న రణ్‌వీర్

అయినప్పటికీ రోజూ షూటింగ్‌కి వచ్చేవాడినని తెలిపారు. తన శరీరంలోని దాదాపు అన్ని ఎముకలకు గాయాలయ్యాయని. చికిత్స కోసం తాను సంప్రదించని డాక్టర్ లేరని తెలిపారు. ఏడు పదుల వయసులోనూ ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. పనిలో ఉంటే తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న విషయం గుర్తుకురాదని, ఇంట్లో కూర్చుంటే ఏదో తెలీని భయం వెంటాడుతుంటుందని తెలిపారు. ప్రస్తుతం అమితాబ్ ‘గులాబో సితాబో’, ‘చెహరే’ సినిమాలతో బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోాగ్రామ్ చేస్తున్నారు. వివిధ బ్రాండ్లకు సంబంధంచిన ప్రకటనల్లోనూ నటిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.