యాప్నగరం

Salman Khan: కత్రినాను మర్చిపోలేక, ఆ హీరోయిన్‌ని ‘క్యాట్’ అని పిలిచేస్తున్నాడు

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఒకప్పుడు ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కత్రినా.. రణ్‌బీర్ కపూర్ కోసం సల్మాన్ ఖాన్‌ను వదిలేసింది. తమది 16 ఏళ్ల చిరకాల స్నేహం అని చెబుతూ ఉంటుంది.

Samayam Telugu 30 Sep 2019, 10:04 am
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి.. బార్బీ డాల్ కత్రినా కైఫ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ పరంగా కత్రినాకు సల్మాన్ పిల్లర్‌లా నిలిచాడు. అవకాశాలు లేకపోతే తన సినిమాల్లోనే హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నాడు. కత్రినా విషయం తెలీదు కానీ.. సల్మాన్ ఖాన్ మాత్రం ఆమెను చాలా ప్రేమించాడు. కానీ పాపం ఆయన ప్రేమ ఫలించలేదు. సల్మాన్ కంటే రణ్‌బీర్ కపూర్ బెటర్ అనుకున్న కత్రినా అతనితో లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉండటానికి నిర్ణయించుకుంది. సరే.. జరిగిందేదో జరిగిపోయింది. ప్రేమ ఫలించకపోయినప్పటికీ సల్మాన్, కత్రినా ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్‌లా ఉంటున్నారు.
Samayam Telugu salman khan katrina kaif
సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్


READ ALSO: అమ్మాయిలను తెచ్చుకోగలను, 200 కోట్లు కావాలి- ప్రియాంకకు కమెడియన్ పంచ్

చూడబోతే సల్మాన్ కత్రినాను మర్చిపోలేకపోతున్నట్లున్నారు. ఏ హీరోయిన్‌ని చూసినా పొరపాటున కత్రినా అని పిలిచేస్తున్నారు. ఆదివారం సల్మాన్ తాను ఎప్పటినుంచో హోస్ట్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్ 13 సీజన్‌ను ప్రారంభించారు. ఈ షోలో బాలీవుడ్ నటి కోయినా మిత్రా కూడా పాల్గొన్నారు. అయితే ఆమెను పొరపాటున ‘క్యాట్’ (కత్రినా ముద్దు పేరు) అని పిలిచేశారు. దాంతో అక్కడున్నవారంతా ఓ..ఓ.. అంటూ కేకలు వేశారు. ఆ తర్వాత తన మిస్టేక్ తెలుసుకున్న సల్మాన్ కోయినా అని పిలవడం మొదలుపెట్టారు. దీనిని బట్టే అర్థమవుతోంది సల్మాన్ కత్రినాను మర్చిపోలేకపోతున్నారని.

READ ALSO: మంచు విష్ణు హాలీవుడ్ మూవీలో బాలీవుడ్ హీరో

అంతేకాదు.. ఓసారి ఓ మీడియా ఛానెల్ సల్మాన్‌ను ప్రశ్నిస్తూ.. ‘మీరు కలిసి పనిచేసిన హీరోయిన్ల గురించి మూడు ముక్కల్లో చెప్పండి’ అని అడిగారు. ఇందుక సల్మాన్.. కరీనా కపూర్ గురించి, ఐశ్వర్య రాయ్ గురించి ఇంకా చాలా మంది గురించి కేవలం కొన్ని సెకన్లు మాత్రమే మాట్లాడారు. కానీ కత్రినా కైఫ్ గురించి మత్రం దాదాపు మూడు నిమిషాల పాటు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ సల్మాన్‌కు కత్రినాపై అంతే ప్రేముంది. కత్రినాను సల్మాన్ కాకుండా మరెవ్వరూ అంత ప్రేమగా చూసుకోలేరేమో. ఏదైతేనేం.. ప్రస్తుతం ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌గా ఉంటున్నారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. మున్ముందూ మరిన్ని సినిమాలు రావాలని అభిమానులూ కోరుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.