యాప్నగరం

Shahrukh Khan వీడియో పోస్ట్ చేసిన సల్మాన్.. ఇన్‌స్టాగ్రామ్ క్రాష్

షారుక్ ఖాన్‌కు సంబంధించిన ఓ వీడియోను సల్మాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ ప్లాట్‌ఫాం కాస్తా క్రాష్ అయింది. షారుక్ చేసిన ఓ సాహసవంతమైన పనిని మెచ్చుకుంటూ సల్మాన్ పోస్ట్ చేసిన వీడియో అది.

Samayam Telugu 31 Oct 2019, 12:10 pm
షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్.. వీరిద్దరూ బాలీవుడ్‌కు రెండు కళ్లులాంటివారు. ఒకప్పుడు నేను గొప్పా నువ్వు గొప్పా అన్నంతగా కొట్టుకున్న వీరిద్దరూ ఇప్పుడు ప్రాణ స్నేహితులు అయిపోయారు. సల్మాన్, షారుక్‌ని ఒకే స్క్రీన్‌పై చూడాలని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు. అయితే.. షారుక్ చేసిన ఓ సాహసవంతమైన పనిని మెచ్చుకుంటూ సల్మాన్ ఖాన్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో రచ్చ పుట్టిస్తోంది. షారుక్ నటించిన ‘హ్యాపీ న్యూఇయర్’ సినిమాలోని ఓ క్లిప్ అది. వీడియోలో షారుక్ షర్ట్‌కి మంటలు వ్యాపించినా కూడా ఆయన ఏమీ కానట్లు వెళ్లిపోతుంటాడు.
Samayam Telugu shahrukh khan salman khan
షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్


READ ALSO: ఈవెంట్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. నిజంగా 50 కేజీ తాజ్‌మహలే

ఇంతకీ సల్మాన్ ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేశాడంటే.. ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో అపశృతి చోటు చేసుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత అమితాబ్ ముంబయిలోని తన నివాసంలో ఇటీవల దీపావళి వేడుకలు నిర్వహించారు. బాలీవుడ్‌కి చెందిన ఎందరో అతిరథమహారథులు వేడుకకు హాజరయ్యారు. ఐశ్వర్య రాయ్‌ వద్ద మేనేజర్‌గా పనిచేసిన అర్చనా సదానంద్ అనే యువతి కూడా వేడుకకు వెళ్లింది. అయితే ఆమె లెహంగా దీపాల మధ్య చిక్కుకుని మంటలు అంటున్నాయి. అక్కడే ఉన్న షారుక్ ఖాన్ వెంటనే అప్రమత్తమై మంటలు అదుపు చేశారు. అర్చన చేతికి కాలికి 15 శాతం గాయాలయ్యాయి.

READ ALSO: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది.. నన్ను సంప్రదించండి అంటున్న స్టార్ హీరో

ఆమెను వెంటనే దగ్గర్లోని లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. రియల్ లైఫ్‌లోనూ షారుక్ హీరో అనిపించుకున్నారని కాంప్లిమెంట్ ఇస్తూ సల్మాన్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ‘మంటల్లో దూకి ఎవరినైతే రక్షిస్తాడో అతడినే హీరో అంటాడు’ అని సల్మాన్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇంకేముంది.. సల్మాన్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే ఫ్యాన్స్ టకటకా లైక్ బటన్ నొక్కిపడేశారు. దాంతో కాసేపటి వరకు సల్మాన్ ఇన్‌స్టాగ్రామ్ క్రాష్ అయింది. దాదాపు పది లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. షారుక్, సల్మాన్ ఒకప్పుడు రైవల్స్ అన్న మాట నిజమే. కానీ తమ మధ్య ఎలాంటి శతృత్వం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రాణ స్నేహితుల్లా మెలుగుతున్నారు. అంతే కాదు ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేసుకుంటున్నారు. షారుక్ నటించిన జీరో సినిమాలో సల్మాన్ అతిథి పాత్రలో మెరిశారు.

READ ALSO: Sonu Nigam నా కాపురంలో నిప్పులు పోశాడు: గాయని
View this post on Instagram @iamsrk A post shared by Chulbul Pandey (@beingsalmankhan) on Oct 30, 2019 at 8:29am PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.