యాప్నగరం

ఆలీయా, నేను మెన్స్ వాష్‌రూమ్‌లోకి వెళ్లాం! కారణం చెబుతూ దీపికా పదుకొనె ఓపెన్..

Alia Bhatt: ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ 'గెహ్రాయాన్' సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న దీపికా పదుకొనె.. ఓ సీక్రెట్ బయటపెడుతూ ఓపెన్ అయింది. ఆలియాతో కలిసి మెన్స్ వాష్‌రూమ్‌లోకి దూరిన సంఘటనపై పెదవి విప్పింది.

Samayam Telugu 31 Jan 2022, 5:41 pm
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఓ సీక్రెట్ రివీల్ చేస్తూ షాకిచ్చే విషయాన్ని బయటపెట్టింది. ఒకానొక సందర్భంతో ఆలియాతో కలిసి మెన్స్ వాష్ రూమ్‌లోకి వెళ్లిన సంఘటన గురించిన సీక్రెట్ రివీల్ చేసింది. ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ 'గెహ్రాయాన్' సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఆమె.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టేసింది.
Samayam Telugu ఆలీయా, నేను మెన్స్ వాష్ రూమ్‌లోకి వెళ్లాం
Deepika Padukone- Alia Bhatt


మరో హీరోయిన్ ఆలియా భట్‌తో కలిసి విదేశాల్లోని ఓ మ్యూజిక్‌ కన్‌సర్ట్‌కు వెళ్లిన దీపికా.. ఆ సమయంలో వారిద్దరి మధ్య చోటు చేసుకున్న ఓ ఆసక్తిర సంఘటనకు అందరితో ఓపెన్‌గా పంచుకుంది. బెర్లిన్‌లో జరిగిన కోల్డ్‌ ప్లే మ్యూజిక్‌ కన్‌సర్ట్‌కు తనతో పాటు ఆలియా కూడా వచ్చిందని, అయితే అక్కడ అర్జెంట్‌గా రెస్ట్‌ రూంకు వెళ్లాల్సిన అవసరం రావడంతో ఇద్దరం కలిసి మెన్స్ వాష్‌రూమ్‌లోకి వెళ్ళామంటూ ఆ రహస్యం రివీల్ చేసింది దీపికా.

ఉమెన్స్‌ బాత్‌రూం ముందు భారీ క్యూ ఉండటంతో తప్పని పరిస్థితుల్లో ఏం ఆలోచించకుండానే తాను, ఆలియా ఆ పక్కనే ఉన్న మెన్స్ వాష్ రూమ్ వాడేసుకున్నామని చెప్పిన దీపికా.. ఆ వాష్ రూమ్స్ డర్టీగా ఉన్నా పెద్దగా పట్టించుకోలేదని చెప్పింది. ఆ తర్వాత ఆలియాను ఎప్పుడు కలిసినా ఆ వాష్ రూమ్ సంఘటనను గుర్తు చేసుకొని బాగా నవ్వుకుంటూ ఉంటామని దీపికా తెలిపింది.
వీకెండ్ స్పెషల్ మందు చిందు!.. భర్తతో అనసూయ ఫుల్ చిల్
ఇకపోతే దీపికా పదుకొనె 'గెహ్రాయాన్' సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో దీపికతో పాటు అనన్య పాండే, సిద్ధార్థ్‌ చతుర్వేదిలు కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 11న ఈ మూవీ ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ మూవీ కోసం బీటౌన్ జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.